
మెదక్, నవంబర్ 22: ఉమ్మడి మెదక్ జిల్లా 4-స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గజ్వేల్ పట్టణానికి చెందిన డాక్టర్ వంటేరి యాదవరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, మెదక్ జడ్పీ చైర్మపర్సన్ హేమలతతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్‌కు నామినేషన్లను అందజేశారు. అంతకుముందు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డి ఎమ్మెల్యేలను జడ్పీ చైర్మన్ హేమలతాశేఖర్గౌడ్ను కలిశారు. ఈ సందర్భంగా వారు యాదవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్, గజ్వేల్, నర్సాపూర్, అందోల్ నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టరేట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌తో పాటు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
ఒకే రోజు నాలుగు నామినేషన్లు..
04-స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోమవారం ఒకేరోజు నలుగురు నామినేషన్లను దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గజ్వేల్ పట్టణానికి చెందిన డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మి, మెదక్ నియోజకవర్గానికి చెందిన ఐరేని సత్యనారాయణగౌడ్, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన చింతల సాయిబాబా తమ నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్‌కు అందజేశారు.
నేటితో ఆఖరు..
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మంగళవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్నది. ఈ నెల 16వ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కాగా, సోమవారం వరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఆరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్ ఈ నెల 18న రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 24వ తేదీన నామినేషన్ల పరిశీలన అనంతరం, 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమున్నది.