మనోహరాబాద్, జూన్ 23 : మనఊరు-మనబడి’తో పాఠశాలలకు మహర్దశ పట్టిందని, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అందించే విద్యాప్రమాణాలన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబా టులోకి వస్తాయని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ పేర్కొ న్నారు. గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, ‘మనఊరు- మనబడి’లో చేపట్టిన పనులను పరిశీలించి, చేపట్టనున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా పథకాలు రూపొందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో ఉన్నత ప్రమాణాలకు వేదికగా ప్రభుత్వ పాఠశాలలు మారాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్ రెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయుడు వెంకట్ స్వామి, విద్యాకమిటీ చైర్మన్లు శ్రీనివాస్, మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి రూపాగౌడ్, గంతి రమేశ్, మహిపాల్ రెడ్డి, మహేశ్ గౌడ్, భిక్షపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
పదో తరగతి పాసైన విద్యార్థులందరూ ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని రామాయంపేట ప్రభు త్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి అన్నారు. ధర్మా రం(ఢీ), లక్ష్మాపూర్, రాయిలాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భో జనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలతోపాటు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. కార్యక్రమంలో లెక్చరర్లు మల్లేశం, శ్రీదేవి, అశోక్‌గౌడ్, బాలప్రకాశ్, బాబూరావు, మాధవి పాల్గొన్నారు.