మెదక్ రూరల్, జూన్ 19 : వానలు పడడంతో అన్నదాత లు పొలంబాట పట్టారు. ఇప్పటికే దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసి, పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. పత్తి పంట సాగు చేపట్టారు. బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లుండడంతో నాట్ల కోసం వరి తుకాలను వేశారు. భూములను దుక్కి చేసిన రైతులు పత్తి, మొక్కజొన్న పంటల సాగు చేపడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను అందజేయడానికి ఏర్పాటు చేసింది. వర్షాలు కురుస్తుండంతో ఎరువులు, విత్తనాలను తీసుకుళ్లేందుకు రైతులు బారులు తీరుతున్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి, మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి మండలాలని చెందిన వివిధ గ్రామాల రైతులు వచ్చి ట్రాక్టర్లలో ఎరువులు, విత్తనాలను తీ సుకొని వెళ్తున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండాఎకరానికి రూ.38వేల పంట రుణాన్ని సహకార సంఘాలు ఇస్తున్నాయి.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రాష్ట్రప్రభుత్వం సరఫరా చేసున్న సబ్సిడీ విత్తనాలతోపాటు ఎరువులు, వ్వవసాయ పనిముట్లు అందజేస్తున్నారు. నిర్ణీత ధరలకే సహకార సం ఘాల్లో యూరియా, పాస్పేట్, జింక్, పొటాషియం, సూపర్ సల్ఫేట్ ఎరువులు విక్రయిస్తున్నారు. సహకార సంఘాల్లో అం దుతున్న సేవలపై రైతాంగం సంతోషం వ్యకం చేస్తున్నారు, నిజాంపేట మండలంలో రైతులు దుక్కి దున్నకాలు చేపట్టారు. వానలు పడడంతో పొలంబాట పడుతున్నారు.
అన్నదాతల సంక్షేమమే లక్ష్యం
ప్రాథమిక సంఘం ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన సేవలందిస్తున్నాం. బ్యాం కులకు దీటుగా రైతులకు పంట రుణాలు ఇస్తున్నాం. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం. వ్యవసాయాధికారుల సూచనలతో పంటలను సాగు చేయాలి. రైతు సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నాం.
– హనుమంత్‌రెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్
అవసరమైన మోతాదులో ఎరువులు వాడాలి
పీఏసీఎస్‌లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నవాటికి రైతులు రసీదులు తీసుకోవాలి. వ్యవసాయాధికారుల సూచనలతో అవసరమైన మోతాదులో ఎరువులు వాడాలి. సేంద్రి య ఎరువులు, పంట మార్పిడి, నియంత్రిత పాగుపై అవగాహన కల్పించాం.
– ఏవో శ్రీనివాస్