రామాయంపేట, జూన్ 14: పల్లెప్రగతిలో పల్లెలు కొత్తగా మారాయాని ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని డీ. ధర్మారం, శివ్వాయపల్లె, అక్కన్నపేట గ్రామాల్లో మండలస్థాయి బృందం పర్యవేక్షణ చేపట్టిం ది. ముందుగా డీ.ధర్మారం గ్రామంలోని నర్సరీని పరిశీలించి అక్కడ ఈదురు గాలులకు వంగిపోతున్న మొక్కలకు ఆసరా గా కర్రలను బిగించారు. అక్కడి నుంచి శివ్వాయపల్లెకు వెళ్లి పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ పల్లెప్రగతిలో పల్లెలు, గ్రామాల్లో వీధులన్నీ సుందరంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పల్లెలో సైతం క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు, డంపుయార్డులకు నిధులను సమకూర్చి నేడు పల్లెలు పట్టణాలకు ధీటుగా మా రుతున్నాయన్నారు. ఎంపీడీవో వెంట ఎంపీవో గిరిజారాణి, ఆయా గ్రామాల కార్యదర్శులు, సర్పంచులు ఉన్నారు.
ప్రహరీ పనులను పరిశీలించిన కమిషనర్
పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా రామాయంపేట పట్టణ శివారులో ఉన్న కాళ్లగడ్డ శ్మశాన వాటిక పనులను రామాయంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ పరిశీలించారు. మంగళవారం పట్టణప్రగతిలో భాగంగా పట్టణంలోని వార్డులను తిరిగి వార్డు ప్రజలకు స్వచ్ఛత, తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం కాళ్లగడ్డ ప్రాంతంలోని శ్మశాన వాటికలో ప్రహరీ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రహరీ నాణ్యతతో నిర్మించాలని లేకుంటే బిల్లులను ఆపుతా మన్నారు. పట్టణంలోని ఆరో వార్డులో కౌన్సిలర్ దేమె యాదగిరి బోరుబావిలో మోటర్‌ను బిగించారు. దీంతో వార్డు ప్రజల నీటిబాధలు తీరాయి. కార్యక్రమంలో ఏఈ యుగంధర్, మేనేజర్ శ్రీనివాస్, ప్రసాద్ ఉన్నారు.

పల్లె ప్రగతితో సమస్యలకు పరిష్కారం
మెదక్ రూరల్, జూన్ 14: పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని ఎంపీవో ప్రశాంత్ అన్నారు. మంగళవారం మెదక్ మండల పరిధిలో ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీంచారు. పల్లె ప్రగతి పెండింగ్ పనులను పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో ఆయా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పట్టణ ప్రగతి
జిల్లా కేంద్రంలో 12వ రోజు మంగళవారం 20, 23వ వార్డుల్లో పట్టణప్రగతి కొనసాగింది. ఈ సందర్భంగా వార్డుల్లోని మురుగు కాలువలు శుభ్రం చేసి, చెత్త చెదారాన్ని తొలిగించారు. మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, శేఖర్ అధ్యక్షతన వార్డు సభలు ఏర్పాటు చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీహరి మాట్లాడుతూ రానున్న వాన కా లం దృష్ఠ్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలంత భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ జయరాజు, డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్ధేశ్వరీ, శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, వార్డుల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

జోరుగా పల్లెప్రగతి పనులు
మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంగళవారం నార్లపూర్ గ్రామాన్ని డీఎల్పీవో శంకర్‌నాయక్ సందర్శించి గ్రామ నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. నిజాంపేటలో పల్లెప్రగతిలో భాగంగా మిషన్ భగీరథ పైపులైన్‌ను గ్రామం మొత్తానికి తాగునీటిని సరఫరా చేసే సంపునకు అనుసంధానం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు అమరసేనారెడ్డి, అనూష, గ్రామ ప్రత్యేకాధికారి సతీశ్, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్, నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహులు, గ్రామస్తులు ఉన్నారు.
కొనసాగుతున్న పల్లెప్రగతి పనులు
చేగుంట, నార్సింగి మండలాల్లోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మండల పరిధిలోని చిన్నశివునూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు పిచ్చి మొక్కలను తొలిగించారు. నార్సింగి మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలిగింప చేశారు. స్థానిక సర్పంచ్ చెప్యాల మల్లేశంతో పాటు పలువురు వార్డు సభ్యులతో కలిసి రోడ్లను శుభ్రం చేయించారు.
నర్సాపూర్‌లో జోరుగా పట్టణ ప్రగతి
నర్సాపూర్ మున్సిపాలిటీలో 4వ విడుత పట్టణప్రగతి కార్యక్రమంలో జోరుగా కొనసాగుతుం ది. మంగళవారం మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేశారు. 12వ వార్డులో మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి వైకుంఠధామానికి ప్రహరీ నిర్మించడానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.