రామాయంపేట, జూన్ 9 : వరుస ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల్లో జోష్ నెలకొంది. నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించాలని సదుద్దేశంతో మెదక్ ఎమ్మెల్యే దంపతులు పద్మాదేవేందర్ రెడ్డి స్వస్థలమైన రామాయంపేటలో ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రామాయంపేట అయ్యప్ప ఆలయంలో శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు ఎనిమిది మండలాల నుంచి వివిధ కోర్సులకు అభ్యర్థులు హాజరై ఉచిత శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులందరికీ మధ్యాహ్న భోజనంతో పాటు మెటీరియల్‌ను అందజేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కోచింగ్ ఇస్తున్నారు.
560 మంది అభ్యర్థులు హాజరు
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన కోచింగ్ సెంటర్‌కు అపూర్వస్పందన లభిస్తున్నది. ఏప్రిల్ 12 నుంచి జూన్ 12 వరకు రెండు నెలల పాటు జరిగే కోచింగ్‌కు 8 మండలాలకు చెందిన 560 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.
అభ్యర్థులకు టెస్టులు పెడుతున్నాం : ఫ్యాకల్టీ
రామాయంపేట అయ్యప్ప ఆలయ భవనంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థ్థులకు ప్రతిరోజూ సబ్జెక్టుల వారీగా బోధించి, మరునాడు వారికి టెస్టులు పెట్టి వారితోనే మళ్లీ సబ్జెక్టును అవగాహన కల్పిస్తున్నాం. రామాయంపేటలో శిక్షణ పొం దుతున్న వారిలో ఎక్కువ శాతం పోలీసు ఉద్యోగానికే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగం సాధించేలా శిక్షణ ఇస్తున్నాం.
క్రమశిక్షణతో చదివితేనే విజయం ..
ప్రతి అభ్యర్థి క్రమశిక్షణతో కష్టపడి చదివితే విజయం మనల్నే వరిస్తుంది. సీఎం కేసీఆర్ సార్ ఉద్యోగ ప్రకటన చేసి నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉచిత శిక్షణతో పాటు ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేశాం. మేము సొంతంగా ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్‌కు 560 మంది అభ్యర్థులు హాజరవడం చాలా సంతోషంగా ఉన్నది. రామాయంపేట సీఐ, ఎస్సై లు ప్రత్యేక శ్రద్ధ్ద వహించి అభ్యర్థులకు పూర్తి సహకారం అందించడం శుభ పరిణామం.
-పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
పట్టుదలతో చదవాలి ..
ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదవాలి. నిరుద్యోగుల కోసం రామాయంపేటలో ఉచిత శిక్షణను పోలీస్ వారి సహకారంతో ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించాం. అభ్యర్థులం దరికీ అన్ని రకాల మెటీరియల్‌తో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేశాం.
– దేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్