మెదక్ మున్సిపాలిటీ, జూన్ 6: వచ్చే వాన కాలం సీజన్లో నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. సాంకేతికతను ఉపయోగించుకుని అన్నదాతలకు చేయూతనందించడానికి వ్యవసాయ అధికారులు సన్నాహాలు చేస్తున్నా రు. జిల్లాలోని డీలర్ల వారీగా విత్తన నిల్వల సమాచారం ని క్షిప్తం చేస్తున్నారు. విత్తన నిల్వల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. వ్యాపారులు తమవద్ద నిల్వల సమాచారం ఎప్పటికప్పుడు నిర్దేశిత సైట్లలో నమోదు చే యాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారులకు దీనిపై ప్ర భ్వుత్వం ఇప్పటికే అవగాహన కల్పించారు. వ్యవసాయధికారులు డీలర్లకు అవగాహనపరిచి లాగిన్, ఐడీలు అందజేశారు.
అక్రమాలకు కళ్లెం..
కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా నాణ్యతలేని విత్తనాలు అన్నదాతలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి తోడు విక్రయించిన సమయంలో రసీదులు ఇవ్వకుండా తెల్ల కాగితాలపై రాసి ఇస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. విత్తనాలు మొలకెత్తకపోవడంతో పాటు నాణ్యత లేక ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక రైతన్నలు ఆర్థికంగా నష్టపోతున్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టినా ఫలితం దక్కడం లేదు. ఆన్లైన్ విధానంతో డీలర్ల అక్రమాలకు తెరపడనుందని అధికారులు భావిస్తున్నారు. తనిఖీలు నిర్వహించిన సమయంలో సైట్లో పేర్కొన్న వివరాలకు తేడా ఉంటే సదరు డీలర్‌పై చర్యలు తీసుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రైతులు ఏ డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేశారో వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్లో చూడనున్నారు. ఆయా వివరాలను మండల వ్యవసాయాధికారి నుంచి జిల్లా అధికారి వరకూ తెసులుకునే అవకాశమున్నది. రైతు కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తకపోతే విత్తనాలు విక్రయించిన డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశమున్నది.
పక్కాగా నమోదు..
పారదర్శకంగా..
ఆన్లైన్ విధానం ఈ నెల నుంచే అమలవుతుంది. ఇప్పటికే డీలర్లకు యాప్ వినియోగం, ఆన్లైన్లో నమోదుపై అవగాహన పరిచాం. ఆన్లైన్ నిల్వల వివరాలతో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలను అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈవిధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతున్నది. జిల్లాలో 190 విత్తన దుకాణాలు ఉన్నాయి.
– పరశురాంనాయక్, జిల్లా వ్యవసాయధికారి, మెదక్