రైతులు వరి స్థానంలో ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని, సంగారెడ్డి జిల్లా నేలలు సాగుకు ఎంతో అనుకూలమైనవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం కొండాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానకాలం సాగు సన్నాహక సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసిన ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వరి పంటే కాకుండా ఆముదం, పత్తి, కంది సాగు చేసుకోవాలని, పంట మార్పిడి పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజుగా చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
కొండాపూర్, మే 31: రాష్ట్రంలోనే పంటలకు అనువైన జిల్లా సంగారెడ్డి అని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం కొండాపూర్ మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వానకాలం సాగుకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆరోగ్య, వ్యవసాయ శాఖ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులు ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా సాగు చేసుకుంటే దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు.
సంగారెడ్డి జిల్లాలో వరి సాగు తక్కుగా ఉంటుందని, పత్తి, కంది, కూరగాయల పంటలు ఎక్కువగా సాగు చేస్తారని తెలిపారు. రైతులు ఇతర పంటలు సాగు చేసుకుంటే ఆర్థికంగా నిలువగలుగుతారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్నదాతల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతులు ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వానకాలంలో ప్రతి రైతు తప్పనిసరిగా వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. అలాంటప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పచ్చిరొట్ట ప్రాథమికంగా నేలకు పోషకాలు, సేంద్రియ నత్రజనిని అందిస్తుందన్నారు. అంతేకాకుండా సేంద్రియ పదార్థాన్ని పెంపొందిస్తుందన్నారు. పచ్చిరొట్ట పంటను 30 నుంచి 40 రోజుల్లో పూత దశలో ఉండగానే నేలలో కలియదున్నాలన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్..
– ఎంపీ బీబీపాటిల్
దేశంలో ఎక్కడ లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఈ పథకాలను నీతిఅయోగ్ కూడా ప్రశంసించిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలతో రైతులను రాజులుగా చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, వ్యవసాయశాఖ రాష్ట్ర అధికారి హనుమంతు, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, ఎంపీపీ మనోజ్‌రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు మల్లేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్..
– వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అందిస్తున్నరన్నారు. రైతుల కోసం రూ.3 లక్షల 75 వేల కోట్లతో రైతుబంధును అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. వరి పంటలే కాకుండా రైతులు ఆముదం, పత్తి, కంది పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వానకాలంలో తప్పని సరిగా రైతులు అధికారుల సూచనలతో పంటలకు మందులు, ఎరువులు ఉపయోగించాలన్నారు.