నర్సాపూర్/ కొల్చారం, మే 31 : ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 8 మంది బాధితుల కు 2,67,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేశారు. నర్సాపూర్‌కి చెందిన రజిత రూ.28 వేలు, పుత్రేశ్ రూ.24 వేలు, ఖాజీపేట్కు చెందిన పద్మ రూ. 32 వేలు, రెడ్డిపల్లికి చెందిన స్నేహ రూ.27 వేలు, పుణ్యమ్మ రూ.38 వేలు, అర్జున్ రూ. 60వేలు, గొల్లపల్లికి చెందిన యా దాగౌడ్ రూ.38వేలు, శివంపేట్ మండలం గూడుర్కు చెం దిన వెంకటేశానికి రూ.20 వేలు మంజూరయ్యాయి. ఈ మే రకు బాధిత కుటుంబీకులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చే స్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు నగేశ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో..
కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామానికి చెం దిన పలువురి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మహిళా కమిషన్ కార్యాలయంలో కొల్చారం మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డికి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి అందజేశారు. సంగాయిపేట గ్రామానికి చెందిన బీరప్ప, భూమయ్యకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు మాజీ జడ్పీటీసీ తెలిపారు.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే
అల్లాదుర్గం, మే 31 : ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ అన్నారు. అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుంది. బాధితురాలి కుటుంబానికి మంగళవారం రూ.లక్ష విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేద రోగులకు ఖరీదైన వైద్యం చేయించుకోవడానికి సీఎం రిలీఫ్‌ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు నర్సింహులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దశరథ్, మాజీ సర్పంచ్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.