గుమ్మడిదల, మే 5: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ బోధన ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో పేద విద్యార్థులకు విద్య నందించడానికి మన ఊరు- మన బడి- మన బస్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గురువారం మండలంలోని 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 4 ప్రాథమిక పాఠశాలలకు మన ఊరు-మనబడి పాఠశాలలుగా మొదటి విడుతలో ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మొదటగా అన్నా రం జిల్లా పరిషత్ రూ. 44.51 లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ.3.15 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 70.22 లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ. 5.19 లక్షల నిధులకు, గుమ్మడిదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.69.75లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ. 75.08 లక్షలు, నల్లవల్లి ప్రాథమిక పాఠశాలకు రూ. 6.59 లక్షలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 51.57 లక్షల నిధులతో మన ఊరు- మన బడి కార్యక్రమాల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడుతలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో 55 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ పథకం ద్వారా పాఠశాలలో నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుద్ధీకరణ, తాగు నీరు,విద్యార్థులకు , ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, గ్రీన్ చాక్‌బోర్డులు, ప్రహరీ , కిచెన్ షెడ్లు, ఉన్నత పాఠశాలలో డైనింగ్‌హాల్స్,డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణారెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఏడీ విజయ, ఎంపీడీవో చంద్రశేఖర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోవర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్‌హుస్సేన్, సర్పంచ్‌లు తిరుమలవాసు, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి,డీ.శంకర్, రాజశేఖర్, ఎంపీటీసీలు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, పద్మాకొండల్రెడ్డి, రాజ్యలక్ష్మి, లక్ష్మి, మల్లమ్మ, నాగేందర్‌గౌడ్, ఉపసర్పంచ్లు మురళీ, సంజీవరెడ్డి, మొగులయ్య, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అన్నారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
అన్నారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నారంలో రూ. 2 కోట్ల 75 లక్షల సీఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశా రు. మొదటగా ప్రకృతి నివాస్ కాలనీలో ప్రధాన రోడ్డుకు బీటీ రోడ్డుకు అపర్ణ వెంచర్ రూ.45 లక్షల సీఎస్ఆర్ నిధులతో పనులు ప్రారంభించారు. అనంతరం సోలార్ పరిశ్రమ సీఎస్ఆర్ రూ.40 లక్షల నిధులతో వైకుంఠధామానికి సీసీ రోడ్డుకు, మోల్డ్‌టెక్ పరిశ్రమ ద్వారా రూ.60లక్షల నిధులతో పాఠశాలలో అదనపు గదులు, అన్నారం ప్రధాన రహదారికి సీసీ రోడ్డు, కేసీఆర్ కాలనీకి బీటీ రోడ్డు సీఎస్ఆర్ నిధుల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అన్నారం గ్రామాన్ని పంచాయతీ పాలకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం దీనికి పారిశ్రామికవేత్తలు నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, మండల నాయకులు రుక్మారెడ్డి, నరహరి, శ్రీకాంత్,లక్ష్మణ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం
టీఆర్ఎస్ జిల్లా నాయకుడు సద్దివిజయభాస్కర్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్లొని శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బొంతపల్లిలో సద్ది విజయభాస్కర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడిని, కార్యకర్తలను టీఆర్ఎస్ గుండెల్లో పెట్టుకుంటుందన్నారు. అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. అనంతరం ఎంపీపీ సద్దిప్రవీణా, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహ్మద్‌హుస్సేన్,నాయకులు గోవర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి,గౌరీశంకర్‌గౌడ్ సద్దివిజయభాస్కర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.