హవేళీఘనపూర్, మే 5 : మండల పరిధిలోని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి స్వగ్రామం కూచన్‌పల్లిలో రూ.10లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామానికి పటిష్టమైన భద్రత లభిం చినట్లు గ్రామస్తులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. కొంత కా లంగా గ్రామంలో దొంగతనాలు జరుగడంతోపాటు ఇతరత్రా సంఘటనల నే పథ్యంలో ఈ విషయా న్ని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి దృష్టికి సర్పంచ్ దేవాగౌడ్ తీసుకెళ్లారు. దీంతో కూచన్పల్లిలోని అన్నీ ప్రధాన వీ ధుల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఇప్పటికే గ్రామ ప్రధాన కూడలి చమన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించిన సమయంలో గుర్తించి పట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. గ్రామంలో దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గ్రామానికి రక్ష ణ కల్పించిన ఎమ్మెల్సీకి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గ్రామ రక్షణకు యువత ముందుకు రావాలి
గ్రామంలో ఏవైనా సంఘటనలు జరి గే సమయంలో యువకులు అప్రమత్తం గా ఉంటూ గ్రామ రక్షణకు పాటుపడాలి. కూచన్‌పల్లి గ్రామాన్ని ఎమ్మెల్సీ సహకా రంతో అభివృద్ధి చేస్తున్నాం. గ్రామ స్తులం దరూ కలిసి కట్టుగా ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటుతో గ్రామానికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, రక్షణ కల్పిస్తాం.
– శేరి నారాయణరెడ్డి, ఎంపీపీ
అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు
సీసీ కెమెరాల ఏర్పాటుకు యువజన సంఘాలు, గ్రామ పెద్దలు ముందుకు వచ్చి తమతమ గ్రామాల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి. దీంతో దొంగతనాలు జరుగకుండా చూడడంతో పా టు, జరిగినా వారిని వెంటనే పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామ ప్రజలకు అన్ని సమయాల్లో కాపలాగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి గ్రామంలో యువకులు, గ్రామ పెద్దలు కలిసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
– మురళి, ఎస్సై
ఎమ్మెల్సీ కృషితోనే సీసీకెమెరాల ఏర్పాటు
కొంత కాలంగా కూచన్‌పల్లిలో దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. వాటికి చెక్ పెట్టేందుకు ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించి, ని ధులు మంజూరు చేశారు. ఎమ్మెల్సీ కృషితోనే కెమెరాలను ఏర్పాటు చేశాం. గ్రామానికి రక్షణ కల్పించిన ఎమ్మెల్సీకి గ్రా మస్తుల తరపున కృతజ్ఞతలు.
– దేవాగౌడ్, సర్పంచ్