శివ్వంపేట/మెదక్ రూరల్/ హవేళీఘనపూర్/ నిజాంపేట, మే 1 : సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అ న్నారు. ఆదివారం శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్ల, పెద్దగొట్టిముక్ల, గోమారం, శివ్వంపేట గ్రామాల్లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని మొండిచెయ్యి చూపినా సీఎం కేసీఆర్ గతం కంటే ఎక్కువ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చెల్లిస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు లు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మైసయ్యయాదవ్ పాల్గొన్నారు.
ధాన్యాన్ని ఆరబెట్టాలి : పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్‌రెడ్డి
మెదక్ మండలంలోని ర్యాలామడుగు, రాజ్‌పల్లి, ఖాజీపల్లి గ్రామల్లో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను చైర్మన్ చిలుముల హనుమంత్‌రెడ్డి ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని మద్దతు ధరతో తెలంగాణలో పండిని ప్రతి గింజనూ కొనుగోలు చేస్తునట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని పూర్తి ఆరబెట్టి 17శాతం తేమకు మించకుం డా కొనుగోలు కేంద్రలకు తీసుకురావాలని సూచించారు. కా ర్యక్రమంలో ఖాజిపల్లి ఎంపీటీసీ ప్రభాకర్,టీఆర్ఏస్ నాయకులు భిక్షపతి పోలీస్ నర్సింహరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ధాన్యానికి మద్దతు ధర : ఎంపీపీ శేరి నారాయణరెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్‌రెడ్డి తెలిపారు. హవేళీఘనపూర్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి ధాన్యా న్ని కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెకర్లు, నాయకులు పద్మారావు, శ్రీకాంత్, సాయికుమార్, శెట్టిపల్లి యాదయ్య, ఈర్ల పాపయ్య, ఆకుల వెంకట్ పాల్గొన్నారు.
కేంద్రాల్లో అన్ని వసతులు : ఎంపీపీ సిద్ధిరాములు
నిజాంపేట మండలం వెంకటాపూర్(కె)లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ సిద్ధిరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. రైతులు నష్టపోవద్దనే లక్ష్యంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు రైతులకు కావాల్సిన సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనిల్‌కుమార్, టీఆర్ఎస్ నేత దయాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.