పటాన్చెరు/మెదక్, ఏప్రిల్ 30: నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు భారీగా ఉత్పత్తులు సాధిస్తున్నాయి. తద్వారా కార్మికులకు పుష్కలంగా ఉపాధి లభిస్తున్నది. విద్యుత్ వెలుగులతో కార్మికులకు ఓటీ పని దొరుకుతున్నది. కార్మికుల ఉపాధి, రక్షణ, వేతన చట్టాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నది. రాష్ట్రంలో కార్మికులకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన భవన నిర్మాణ సంక్షేమ మండలితో సంగారెడ్డి జిల్లాలో 75వేల మంది, మెదక్‌లో 24వేలు, సిద్దిపేటలో 6వేల మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2వేల పరిశ్రమలు ఉంటే, వాటిలో 1.25లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మెదక్ జిల్లాలో మరో 620వరకు పరిశ్రమలు ఉన్నాయి. మిని మం వేజేస్ చట్టాన్ని తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తున్నది. అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణలోనే కార్మికులకు ఆదా యం, రక్షణ లభిస్తున్నదని గుర్తించిన పలు రాష్ర్టాల కార్మికులు, మనవద్దకు ఉపాధికోసం వలస వస్తున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు కూడా ప్రభుత్వం భద్రత ఇస్తుండటంతో వారి చెమటకు గుర్తింపు లభిస్తున్నది.
కార్మికులకు భరోసా…
సంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు 2వేల వరకు పరిశ్రమలు ఉన్నాయి. పలు పారిశ్రామిక వాడల ఏర్పాటుతో 1500 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఫార్మా పరిశ్రమలకు, బల్క్‌డ్రగ్, కెమికల్ పరిశ్రమలకు కేంద్రంగా జిల్లా ఉంది. అందులో వెయ్యి కి పైగా కార్మికులు పనిచేసే భారీ పరిశ్రమలు 15వరకు ఉన్నా యి. మిగిలినవి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. రాష్ట్ర ఆదాయంలో మన పరిశ్రమల ఆదాయం కీలకం. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల హక్కులు కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నది. సాధారణంగా ఉన్నత ఉద్యో గాల్లో ఉన్నవారికి మంచి వేతనాలు ఉంటాయి. కార్మికులుగా పనిచేసేవారిలో మూడు కేటగిరీలు ఉంటా యి. హెల్పర్‌కు రూ. 9వేలు, సెమీ స్కిల్ ఉంటే రూ. 11వేలు, స్కిల్ వర్కర్ అయితే రూ. 14వేలు ఇస్తున్నారు. కార్మికశాఖ మినిమం వేజేస్ చట్టం అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నది.
పరిశ్రమల్లో 8గంటల పని విధానం, వీక్లీ ఆఫ్‌తో పాటు బోనస్, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలతో కార్మికులకు భద్రత పెరిగింది. ఒకప్పుడు పరిశ్రమలకు వారంలో మూడు రోజులు విద్యుత్ కోత ఉండేది. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కోతలు లేకుండా 24గంటల నాణ్యమైన విద్యుత్ పరిశ్రమలకు వస్తున్నది. దీంతో పరిశ్రమల్లో మూడు షిప్టులు ఉత్పత్తులు కొనసాగు తున్నా యి. పరిశ్రమలు ఆసక్తి ఉన్న కార్మికులకు ఓటీలు ఇచ్చి అదనపు ఆదాయం కల్పిస్తున్నాయి. ఓటీలు ఎక్కువగా ఇస్తున్నారనే కారణంతోనే పారిశ్రామికవాడలకు వేరే రాష్ర్టాల వారు, ప్రధానంగా ఉత్తర భారత దేశం నుంచి పోటెత్తుతున్నారు.
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటు..
తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటుతో భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న అన్నిరకాల కార్మికులకు భద్రత లభిస్తున్నది. ఈ సంక్షేమ పథకాలు దేశం లో ఎక్కడ అమలులో లేవు. రూ. 110 కట్టిన భవన నిర్మాణ కార్మికుడికి ఐదేళ్ల బీమా ఉంటుంది. ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే రూ. 6లక్షల పరిహారం లభిస్తున్నది. సహజ మరణానికి రూ. లక్ష అందజేస్తారు. కార్మికుల పిల్లల వివాహాల కు రూ. 30వేల బహుమతిని, రెండు కాన్పులకు రూ. 30వేల చొప్పున అందజేస్తారు.
ఈ పథకంలో ఉన్న కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు రూ. 30వేలు లభిస్తాయి. జిల్లాలో భవన నిర్మాణ అనుబంధ రంగా ల్లో 75వేల మంది కార్మికు లు ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం సంక్షేమ మండలి ద్వారా భద్రత కల్పించింది. వీటితో పాటు ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్‌లో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పలు రంగాల వ్యక్తులకు రక్షణ కల్పిస్తున్నారు. మీ సేవా కేం ద్రాల్లో అసంఘటి త రంగాల్లో పనిచేస్తున్న వారు ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్‌లో తమ పేర్లను న మోదు చేసుకోవాలి. దీనికి ఉచితంగానే నమోదు చేస్తారు. మీరు ఏ రంగంలో సేవలందిస్తున్నారో ఆ కేటగిరీలో నమోదు చేసి ప్ర భుత్వం ద్వారా వస్తున్న పలు పథకాలను తెలుపుతారు. వాటి ని సద్వినియోగం చేసుకుని లబ్ధ్ది పొందాల్సి ఉంటుంది. పరిశ్రమ ల్లో 1.25 లక్షల మంది, భవన నిర్మాణ రంగంలో 75వేల మం ది ఉపాధి పొందుతున్నారు. అసంఘటిత రంగంలోను ఇదే స్థాయిలో ఉపాధి కల్పించుకున్నారు. వీరందరి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత పారిశ్రామిక రంగంలో, కార్మిక రంగంలో భరోసాకు కారణం అవుతున్నది. కార్మిక చట్టాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు కార్మిక సంఘాల పోరాటాలు చాలా వరకు తగ్గాయి.
తెలంగాణ సర్కారు కార్మిక పక్షపాతి..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికులకు భద్రత పెరిగింది. విద్యుత్ కోతలను నిలువరించి 24గంటలు కరెంట్ ఇవ్వడం పరిశ్రమలకు జీవం పోసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వందల పరిశ్రమలు జిల్లాకు వచ్చాయి. వీటితో వేలాదిమంది కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. కార్మికులకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్కేవీ యూనియన్ పోరాటాలు చేసి యాజమాన్యాల మెడలను వంచుతున్నది. హక్కులను కాపాడేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల రక్షణకు ఏర్పాటు చేసిన సంక్షేమ మండలితో లక్షలాది కార్మికులకు భరోసా దొరికింది. పటాన్చెరు ప్రాంతం మినీ ఇండియా, దేశం నలుమూలలనుంచి ఉపాధికోసం ఇక్కడికి వలస వస్తున్నారు.
– యాదగిరి యాదవ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి
కార్మికుల హక్కులకు ప్రాధాన్యం..
కార్మికుల హక్కులను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కార్మికులకు మినిమం వేజేస్ ఇవ్వడం, ఎనిమిది గంటల పనిపై ప్రత్యేక దృష్టిసారించాం. అప్పుడప్పుడు వివాదాలు వస్తే వాటిపై విచారణ చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటున్నాం. భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు సంక్షేమ మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 75వేల మంది జిల్లా కార్మికులకు లాభం చేకూ రు తున్నది. మంచి పథకం ఇది. దేశంలో ఎక్కడ లేదు. అసంఘటిత రంగంలో ఉన్న వారు కూడా ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్‌లో రిజిస్టర్ అయితే వారికి కూడా అనేక పథకాలు లభిస్తాయి.
– కె. రవీందర్‌రెడ్డి, కార్మికశాఖ డిప్యూటీ కమీషనర్ సంగారెడ్డి జిల్లా