హత్నూర, ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం హత్నూర మం డలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ నర్సింహులు అధ్యక్షతన నిర్వహించగా, కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నదన్నారు. అంతకుముందు ఆయా శాఖల అధికారులు వారి నివేదికలు సమావేశంలో చదివి వినిపించారు.
ఎంపీవోపై చర్యలకు వినతి
గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్‌ను తన డ్రైవర్‌గా పనిచేయిస్తున్న ఎంపీవో సువర్ణపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్, డీపీవో దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జడ్పీటీసీ ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శారదాదేవితోపాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పండుగలు సంతోషంగా జరుపుకోవాలి
హత్నూర, ఏప్రిల్ 28: పండుగలు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం హత్నూరలో ముస్లింలకు ప్రభుత్వం పం పిణీ చేసిన కొత్తబట్టలను అందజేశారు. తెలంగాణ ప్రభు త్వం నిరుపేదలు పండుగలు సంతోషంగా జరుపుకోవడం కోసం కొత్తబట్టలు పంపిణీ చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీడీవో శారదాదేవి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.