సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 28: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరుగుతున్నదన్నారు. గురువారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు అంజద్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాసాన్ని విరమించి అక్కడే మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విందు భోజనాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నది తెలంగాణ ప్రభుత్వమన్నారు. మైనార్టీలు ఉన్నత స్థాయికి ఎదగలని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి లక్షా 14వేల మందికి నాణ్యమైన విద్యను అందిస్తామని, షాదీముబారక్ కింద ఇప్పటి వరకు 2లక్షల 21వేల మంది మైనార్టీలకు ఆర్థిక సహా యం చేసి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌కు అల్లా ఆయురారోగ్యాలు ప్రసాదించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించే శక్తిని ఇవ్వాలని ప్రార్థనలు చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, నాయకులు మనోహర్‌గౌడ్, ప్రభుగౌడ్, డాక్టర్ శ్రీహరి, షేక్ సాబేర్, శ్రావణ్‌రెడ్డి, జలేంధర్, నక్క నాగరాజు, వెంకటేశం, నర్సింహులు, వాజీద్ పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సముచిత గౌరవం: బీబీ పాటిల్
నారాయణఖేడ్, ఏప్రిల్ 28: కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత గౌరవం లభిస్తున్నదని, కులమతాలకతీతంగా అందరు కలిసిమెలిసి ఉండాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని జహీరాబాద్ ఎంపీ బీ బీ పాటిల్ అన్నారు. గురువారం సాయంత్రం నారాయణఖేడ్ రెహమాన్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ సంప్రదాయం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కా ముస్లిం నిరుపేదలకు ఎంపీ చేతుల మీదుగా కానుకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మహారెడ్డి రోషన్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్ పాల్గొన్నారు.
సర్వమతాలకు సమన్యాయం: ఎమ్మెల్యే
రామచంద్రాపురం, ఏప్రిల్ 28: సర్వమతాలకు సమన్యాయం చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని ఎల్‌ఐజీలో కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలు ఉపవాస దీక్షను విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కులమతాలకతీతంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. మత ఘర్షణలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మినీ ఇండియా గా పిలువబడే పటాన్చెరు నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నదన్నారు. ముస్లిం లు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్‌యాదవ్, భారతీనగర్, ఆర్సీపురం డివిజన్ల అధ్యక్షులు బూన్, గోవింద్, సర్కిల్ యువజన అధ్యక్షుడు నర్సింహ్మ, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు నగేశ్, కుమార్‌గౌడ్, జగన్నాథ్‌రెడ్డి, విజయ్, ఖదీర్, అజీముద్దీన్, కుత్బుద్దీన్ ఉన్నారు.