గుమ్మడిదల/జిన్నారం/పాపన్నపేట/చేగుంట, ఏప్రిల్ 25 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మెండి వైఖరి అవలంభిస్తున్నదని, రైతుల మేలు కోరి సీఎం కేసీఆర్ , దేశంలో ఎక్కడలేని విధంగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్ అన్నారు. నార్సింగి సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నార్సింగిలో రజక సంఘం, కుమ్మరి సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. చేగుంట మండలంలోని వడియారంలో ఐకెపీ ఆధ్వర్యంలో,ఇబ్రహీంపూర్ సొసైటీ ఆధ్వరంలో మక్కరాజిపేట,రెడ్డిపల్లి సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేగుంట,నార్సింగి మండలాల ఎంపీపీలు మాసు ల శ్రీనివాస్, చిందం సబీత, జెడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్, బాణపురం కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, వైస్ చైర్మన్ ఎన్నం రాజేదర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, నాయకలు పాల్గొన్నారు.
పాపన్నపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం రైతు శ్రేయస్తే లక్ష్యంగా పని చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. రైతు శ్రేయస్సు కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందనప్రశాంత్రెడ్డి, జిల్లా రైతుబంధు కమిటీ అధ్యక్షుడు తాడేపు సోములు, ఏడుపాయల మాజీచైర్మన్ గోపాల్‌రెడ్డి, పాపన్నపేట సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, నేతలు పాల్గొన్నారు.
జిన్నారం, ఊట్ల, సోలక్పల్లి,కానుకుంట, నల్లవల్లి, కొత్తపల్లిగ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. గుమ్మడిదలలో సీసీ రోడ్లు, నల్లవల్లిలో యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధ్దంగా రాష్ర్టాల్లో పండించిన ధాన్యా న్ని కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సద్ధ్దిప్రవీణారెడ్డి, వైస్‌ఎంపీపీ మంజుల వెంకటేశ్‌గౌడ్, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ సుజాత, ఎంఏవో శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో వడ్ల కొనుగోళ్లపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లను కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గమనించి, ప్రభుత్వమే స్వయంగా వడ్లు కొనుగోలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో విక్టర్, తహసీల్దార్లు, అడిషనల్ పీడీ సూర్యరావు, ఏపీఎంలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. అనంతరం జోగిపేట ప్రభుత్వ దవాఖానాను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యు లు, సిబ్బందితో మట్లాడుతూ అందుతున్న వసతులు,కావాల్సిన సౌకర్యాలను తెలుసుకున్నారు. దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన వాషింగ్ మిషన్లు(ల్యాండ్రీ)లను ప్రారంభించారు. జోగిపేట మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేసిందన్నారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.