శివ్వంపేట, ఏప్రిల్ 22 : సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే మ దన్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడా నికి ఎనలేని కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నగొట్టిముక్ల చౌరస్తా నుంచి సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహాస్వామి దేవాలయం వరకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాలుకు శాస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలను చేర్చడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వ రం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తెప్పిం చి, ఇక్కడి బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్ నియోజక వర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరగడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు. టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన పాదయాత్ర చెన్నాపూర్, పెద్దగొట్టిముక్ల, గోమారం మీదుగా సికింద్లాపూర్ లోని లక్ష్మీనర్సింహ ఆలయం వరకు సుమారు 10 కిలోమీటర్లు చేపట్టారు. లక్ష్మీనర్సింహ ఆలయంలో మహామృత్యుంజయ హోమాన్ని ఆల య ప్రధాన అర్చకులు ధనుంజయశర్మ ఆధ్వ ర్యంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సతీమణి సుజాతమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు మంచినీరు, అంబలి, మజ్జిక ప్యాకెట్లను పైడి శ్రీధర్గుప్త్తా, మాజీ జడ్పీటీసీ కమలపూల్సింగ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి ్ల అందజేశారు.
చిన్నగొట్టిముక్ల గ్రామానికి చెంది న సుదర్శన్ అనే దివ్యాంగుడు తన త్రీవీలర్‌పై ఎమ్మెల్యే మధన్‌రెడ్డి చిత్రపటం పెట్టుకుని పాదయాత్రలో పాల్గొని తన అభిమాన్ని చాటాడు.
పాదయాత్రలో జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయ, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్‌గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపాల్ చైర్మన్ మురళీయాదవ్, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, శ్రీపాద ట్రస్టు చైర్మన్ శ్రీధర్గుప్త్తా, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు లావణ్యామాధవరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు లాయక్, సర్పంచ్‌లు శ్రీ ని వాస్‌గౌడ్, చంద్రకళాశ్రీశైలంయాదవ్, బాల మణీనరేందర్, దుర్గేశ్, శ్రీనివాస్‌గౌడ్, సోనీరవినాయక్, నాయకులు కొడకంచి శ్రీనివాస్‌గౌడ్, గొర్రె వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.