నర్సాపూర్, ఏప్రిల్ 22 : పట్టణంలో మాజీ వార్డు సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు నాగరాజుగౌడ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థ్ధం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని శుక్రవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. అనంతరం నర్సాపూర్ చౌరస్తాలో లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ లలిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, ఏఎంసీ డైరెక్టర్ సాగర్, నేతలు నాగరా జుగౌడ్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు : మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22 : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడానికి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పేర్కొన్నారు. ము న్సిపల్ కార్యాలయం, రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వైస్‌చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో 8 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మహేశ్, కౌన్సిలర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, జయరాజ్, సుంకయ్య, టీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, బోద్దుల కృష్ణ, ప్రవీణ్‌గౌడ్, ప్రసాద్ పాల్గొన్నారు.
హవేళీఘనపూర్‌లో చలివేంద్రం ఏర్పాటు
హవేళీఘనపూర్, ఏప్రిల్ 22 : మండల కేంద్రం హవేళీఘనపూర్‌లో ప్రజల దాహార్తి తీర్చడానికి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ సవిత ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు కృష్ణ, శేఖర్, వెంకట్, గ్రామస్తులు పాల్గొన్నారు.