పాపన్నపేట, ఏప్రిల్ 19 : ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో చెరువులు, కుంటలు, వాగులు, బావుల్లో స్నా నాలు చేయడానికి పిల్లలు, యువకులు ఎక్కువశాతం శ్రద్ధచూపుతుంటారు. వచ్చిరాని ఈతతో ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కోకొల్లలు. ఈత సరదా కోసం వెళ్లి, చెరు వుల్లో విగత జీవులుగా తేలియా డితే కన్నవారి కడుపు కోత వర్ణాతీతం. సరదా కోసం.. ఈత రాకున్నా.. నీళ్లలో దూకి ప్రాణాలను కోల్పోతున్నవారిని చూస్తే కన్నీళ్లు ఆగవు.
వేసవి సెలవులు వస్తున్నాయి.. చిన్నారులను కంటికి రెప్ప లా కాపోడుకోవాల్సిన సమయం వస్తున్నది. సెలవులు వస్తే పిల్లల సంతోషానికి హద్దులే ఉండవు. ఇంట్లో ఒక్క నిమిషం ఉండరు. స్నేహితులతో సరదాగా గడపడానికి గడపదాటుతా రు. వారు ఆడుకుంటున్నారో? చెరువులోకి ఈతకు వెళ్తున్నా రో? తెలియదు. కొందరు స్నేహితులతో కలిసి ఆటలు ఆడితే.. మరికొంతమంది ఈత నేర్చుకోవడానికి చెరువులు, కుంటలలోకి వెళ్తుంటారు. కానీ, స్థానిక చెరువులు, కుంటల స్థితిగతులు తెలుసుకోకుండా అందులోకి దిగి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. తెలిసీతెలియని వయస్సులో ఈతకు వెళ్లి నీట ము నిగి చనిపోతున్నారు. నీటి ప్రమాదాల్లో తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పిల్లలు ఆహ్లాదం కోసం నీటిలో దిగడానికి ఉత్సాహం చూపుతారు. పిల్లలు ఈత కోసం వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు సూచించడమే కా కుండా, నీటి నుంచి కాపాడే లైఫ్‌జాకెట్లు, రబ్బర్ ట్యూబ్, నీటి లో మునగకుండా ఉంచే వస్తువుతోనే ఈత నేర్పించాలి. కానీ, ఇవేవీ లేకుండా వెళ్లి అనేక మంది మృతి చెందుతున్నారు.
ఇటీవల పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆరు రోజుల్లోనే ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. నర్సింగరావుపల్లి గిరిజన తండాకు చెందిన 4వ తరగతి చదివే రమావత్ వసంత(12) అనే బాలిక చెరువులో దిగి నీట ము నిగి మృతి చెందింది. మనోహరాబాద్ మండలంలోని దండుపల్లికి చెందిన పిట్టల రాము(16) అనే పదో తరగతి చదివే విద్యార్థి ఏడుపాయలలో విందుకు హాజరై నీట మునిగి మృతి చెందాడు. ఈ నెల 14న పాపన్నపేట మండలంలోని గాజుల గూడెం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి గూడెం చరణ్ (15) అనే విద్యార్థి స్నేహితులతో కలిసి మంజీరా నదిలో దిగి మృతి చెందిన విషయం తెలిసిందే. కొద్దిపాటి నీరు ఉన్నప్రాంతాన్ని వదిలి లోతైన ప్రాంతంలోకి వెళ్లడమే మృతికి కారణంగా తెలుస్తున్నది. నిర్లక్ష్యంగా ఉంటూ.. లోతైన ప్రాంతంలోకి వెళ్లడ మే విద్యార్థి మృతికి కారణంగా తెలుస్తున్నది.
సెలవుల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యార్థులకు సెలవులు రాగానే సంతోషంగా గడపాలనే కోరుకుంటారు. కొందరు స్నేహితులతో కలిసి ఆటపాటలు ఆడుతూ గడుపుతుంటే మరికొందరు చెరువులోకి వెళ్లి ఈత కొడుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. పిల్లలు చెరువులోకి వెళ్లేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ముఖ్యంగా ఈతరాని పిల్ల లు చెరువులు, కుంటలోకి వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు, రబ్బ ర్ ట్యూబ్‌ను ధరించడంతోపాటు ఈతలో అనుభవమున్న వారి వెంట పంపడం శ్రేయస్కరం.
– నాగరాణి,ఉపాధ్యాయురాలు, (ఉన్నత పాఠశాల పాపన్నపేట)
అవగాహన కార్యక్రమాలు చేపడుతాం..
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పెద్దల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. పాపన్నపేట మండలంలో ఆరు రోజుల్లోనే ముగ్గురు విద్యార్థు లు నీట మునిగి మృతి చెందారు. ముఖ్యంగా ఏడుపాయల వద్ద ప్రమాదకరమైన ప్రాంతమని హెచ్చరిక బోర్డు పెట్టినప్పటికీ అక్కడే స్నానానికి దిగి మృతి చెందడం బాధాకరం, తల్లిదండ్రులను చైతన్యపర్చడానికి వేసవి సెలవుల్లో గ్రామా ల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం.
– విజయ్‌కుమార్, ఎస్సై పాపన్నపేట