మెదక్‌రూరల్, ఏప్రిల్ 18: మహాత్మాగాంధీ జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకం ప్రజల హక్కు అని, ఉపాధి హా మీ పథకంలో అవనీతి చోటు చేసుకుంటే కఠిన చర్యలుంటాయని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవా రం మెదక్ మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని ఉపాధి హామీ కార్యాలయంలో మెదక్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1డిసెంబర్2018 నుంచి 28 ఫిబ్రవరి 2022 వరకు జరిగిన ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారం, ఫామ్‌పాండ్స్, వననర్సరీ, భూ అభి వృద్ధి పనులతో పాటు రోడ్లు తదితర పనులకు రూ.12కోట్ల 63లక్షల 73 వేల115 ఖర్చు చేయగా ఇందులో కూలీలకు రూ. 10,09,43,102 కోట్లు చెల్లించారు. మెటీరియల్ కాంపౌండ్ కింద రూ. 25,43,0013 చెల్లించారు. ఈ నెల 3నుంచి 17వరకు డీఆర్పీల బృందం సభ్యులు గ్రా మాల్లో క్షేత్రస్థాయి లో సామాజిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని 19గ్రామ పంచాయతీల్లో పనులపై 12వ విడుత ప్రజా వేదికలో కూలీల మాస్టర్లు చేసిన పనులపై తనిఖీ నిర్వహించి వాటికి సంబంధించిన వివరాలను అధికారులకు చదివి వినిపించారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ ఉపాధి పనులు సక్రమంగా జరగకపోవడానికి, హరితహారం లో నాటిన మొక్కలు ఎండి పోవడానికి గల కారణాలుపై సంబంధిత టీఎలను, పంచాయతీ కార్యదర్శిలను అడిగి తెలుసుకున్నా రు. ఉపాధి పథకం నిర్విగ్నంగా కొనసాగేలా మండల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
సామాజిక తనిఖీని పరిశీలించిన జడ్పీ వైస్ చైర్పర్సన్
ఉపాథిహామీ పనులపై సామాజిక తనిఖీ పరిశీలించిన జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఎంపీపీ యమునా జయరాంరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఉపాధి హామీ పథకం పనులు పేదలకి ఉపశమనం కల్పిస్తాయని, 100రోజుల ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.
ఈ పథకం గ్రామాల్లో సమర్థవంతంగా అమ లు చేయాల్సిన అవసరం ఉందని ఆయా అధికారులకు సూచించారు. కార్యాక్రమంలో ఏపీడీలు రోజా, బాలయ్య, పీవీవో రాజేంద్ర రెడ్డి, ఎంపీవో మౌనిక, ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి, ప్లాంటేషన్ అధికారి శ్రవణ్, సోషల్ ఆడిట్ సంప త్, సోషల్ ఆడిట్ వింగ్ అంజాగౌడ్, సర్పంచులు వికాస్, ప్రభాకర్, నర్సింహులు నాయకులు, జయరాంరెడ్డి, బాల య్య, ఎలాక్షన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నయీం, లక్ష్మణ్, ప్రవీణ్, మల్లేశం ఉన్నారు.