రామచంద్రాపురం, ఏప్రిల్ 16 : తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లేలా హనుమంతుడు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని కలిగించాలని గురు దత్తపీఠం గణపతి సచ్చిదానందస్వామిజీ అన్నారు. భారతీనగర్ డివిజన్లోని బీడీఎల్ కాలనీ సమీపంలో గణపతి సచ్చిదానంద స్వామిజీ అమృత హస్తాలతో నిర్మించిన గణపతి రాజరాజేశ్వరీ జయలక్ష్మీమాత దత్తాత్రేయ సహిత పంచముఖి ఆంజనేయ స్వా మి ఆలయంలో విగ్రహా ప్రతిష్ఠాపనలో సచ్చిదానంద స్వా మిజీ, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్ పాల్గొన్నారు. స్వామిజీ సమక్షంలో విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. కుంబాభిషేకం, గోపురం పూజలను నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో విశాలమైన స్థలంలో పంచముఖి ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామిజీ మాట్లాడుతూ లోక కల్యాణార్ధం హనుమాన్ చాలీసా పారాయణం, కుంబాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద ఆశ్రమం లో రెండు ఎకరాల స్థలంలో రూ.7కోట్లతో పెద్ద ఎత్తున పంచముఖి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం చేపట్ట డం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొనడం అదృష్టంగా బావిస్తున్నానని తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామిజీ ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు స్వామిజీ దీవెనలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆర్సీపురం డివిజన్ అధ్యక్షుడు గోవింద్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు విజయ్, మల్లేశ్, కృష్ణకాంత్, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.