మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 14: రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నది. అక్రమాలకు తావులేకుండా గతానికి భిన్నంగా కార్డుల తయారీ చేపట్టింది. వాహనదారుడి పూర్తి వివరాలతో కూడిన కార్డులు ముద్రితమవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండేలా డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను వన్ నేషన్ వన్ కార్డు పేరిట దీన్ని అమలుచేస్తున్నది. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇండియన్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం పేరిట, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఇండియన్ యూనియన్ వెహికిల్ రిజిస్ట్రేషన్ పేరిట అందజేస్తున్నది. సాఫ్ట్‌వేర్‌ను మార్చ డంతో ఇటీవలే అమల్లోకి వచ్చింది. మెదక్ జిల్లాలో 21 మండలాల్లో ఉన్నా యి. ఇప్పుడిప్పుడే వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో ని ఆయా ప్రాంతాల్లో నిత్యం వందల సంఖ్యలో కొత్త వాహనాలు నమోదు అవుతుండగా అదే స్థాయిలో డ్రైవింగ్ లైసెన్స్‌లకు దరఖాస్తులు అందుతున్నాయి.
వాహన్ పోర్టల్‌లో..
వాహనాలు రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వాహన్ పేరిట ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. దీంతో దేశవ్యాప్తంగా క్షణాల్లో పూర్తిస్థాయి సమాచారం సేకరించేందుకు వీలుంటుంది. మూడు నెలల క్రితం వరకు కార్డుల పంపిణీ నిలిపి వేసి ప్రభుత్వం ప్రస్తుతం కొత్త కార్డులు అందజేస్తున్నది.
ప్రస్తుతం ఇలా..
కొత్త కార్డులపై అనేక వివరాలు పొందుపరిచింది. జారీ చేసిన తేదీ, బ్యాడ్జి నంబర్, గడువు, ఏఆర్, లైట్ మోటారు వెహికిల్, మోటారు క్యాబ్ వంటి వాహనాలను నడిపేందుకు అర్హుడు అనే వివరాలు ఉన్నాయి. రక్త గ్రూపు తదితర సమాచారాన్ని ముద్రించారు. ఆర్సీ కార్డు పైనా వాహనం రిజిస్ట్రేషన్, గడువు నంబరుతో పాటు అన్ని వివరాలు పొందుపరిచారు.
దేశ వ్యాప్తంగా ఒకే విధానం
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే విధానం అం దుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రెం డు నెలలుగా కొత్త సాఫ్ట్వేర్ సాయంతో కార్డు లు పంపిణీ అవుతున్నాయి. వాహనాలు లేదా కా ర్డు హోల్డరు పూర్తి సమాచారం అందులో నిక్షిప్త మై ఉంటుంది. బ్లడ్ గ్రూప్ వివరాలు కూడా కార్డులో పొందుపరిచారు – శ్రీనివాస్‌గౌడ్, జిల్లా రవాణాధికారి, మెదక్