మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 10 : శ్రీరామనవమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. వివాహ ఘట్టాన్ని వీక్షించిన భక్తజనం తన్మయంలో ము నిగి తేలారు. కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్ జయశ్రీ, రాగి వనజ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు పట్టువస్తాలు, తలంబ్రాలతో పా టు ఒడి బియ్యం సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవంలో కౌన్సిలర్లు ఆర్కె శ్రీనివాస్, మామిళ్ల ఆంజనేయులు, గడ్డమీద యశోద, సమియొద్దీన్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్, మాజీ కౌన్సిలర్ ముత్యంగౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, కమిటీ సభ్యులు, వేదపండితులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలి రావడంతో కోదండ రామాలయం కిటకిటలాడింది.
ఐదు వేల మందికి అన్నదానం..
కల్యాణమహోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు ఐదు వేల మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రాచీన శివాలయంలో..
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవీధిలో ఉన్న ప్రాచీన శివాలయంలో బ్రహ్మశ్రీ వైద్య శ్రీనివాస్ శర్మ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్త భీష్మాచార్యు లు, మున్సిపల్ కౌన్సిలర్ మెఘమాల రాంచరణ్, న్యాయవాది లక్ష్మణ్‌కుమార్, వెంకటేశం పాల్గొన్నారు.
కనుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
జిలా ్లకేంద్రమైన సంగారెడ్డితో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా జరుపుకున్నారు. వైకుంఠపుర దివ్య క్షేత్రంలో ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల వారి సమక్షంలో కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శాంతినగర్‌లోని పంచముఖ హనుమాన్, బైపాస్‌లోని సాయిబాబా ఆలయం, బాలాజీ ఆలయం, పాత బస్టాండ్‌లోని రామాలయం, శివాలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణాన్ని భక్తు లు పెద్ద సంఖ్యలో తిలకించారు. అనంతరం సీతా రాములకు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతిరెడ్డిపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో జరిగిన కల్యాణ వేడుకల్లో టీఆర్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతా విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సీతారాములకు పోసిన తలంబ్రాలను భక్తులకు ప్రసాదంగా అందజేయడంతో పాటు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు.
సీతారాముల ఊరేగింపు
కంది మండలం చెర్యాల్ గ్రామంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్, టీఎస్ ఎంఐడీఎస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.