మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 10: మెదక్ మహా దేవాలయంలో (చర్చి) మట్టల ఆదివారాన్ని చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి ప్రేమ్‌సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తు లు తరలిరావడంతో మహా దేవాలయం కిటకిటలాడిం ది. యేసు శిలువతో పాటు భక్తులు మట్టలతో భక్తి గీతాలు అలపిస్తూ మహా దేవాలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడం చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. యేసు ప్రభువు జేరుసలేం పట్టణంలో ప్రప్రథమంగా ప్రవేశించినపుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై తీసుకుని వస్తూ పెద్దఎత్తున వివిధ రకాల మట్టలతో (చెట్ల కోమ్మలతో) ఘన స్వాగతం పలుకుతారు. దీనినే క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారని వారు తెలిపారు. ఈ పండగను గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపు కొం టారు. ఈ వారాన్ని పరిశుద్ధ వారంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా చర్చి బిషప్ రెవరెండ్ సాలో
మాన్రాజ్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. అంతకు ముందు సండే స్కూల్‌కు చెందిన చిన్నారులు వివిధ రూపాల్లో యేసుక్రిస్తు పుట్టు పూర్వోత్తరాలు తెలిపేలా సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహించారు. భక్తులు యేసయ్యకు మొక్కులు చెల్లించుకుని, వసతి గృహలతో పాటు చర్చి ఆవరణలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో చర్చి అసిస్టెంట్ ప్రెసిబేటరీ ఇన్చార్జి విజయ్‌కుమార్, పాస్టర్లు రాజశేఖర్, దయానంద్, డెవిడ్, జైపాల్ సీఎస్ఐ కమిటీ సభ్యులు రోలండ్పాల్, సాంసన్ సందీప్, సుశీల్‌కుమార్, సునీల్, సాలోమాన్, శాంతికుమార్, సువన్డగ్లస్, గెలెన్, వసతి గృహాల మేనేజర్ జాయ్ముర్రేలతో పాటు తదితరులు పాల్గొన్నారు.