రామాయంపేట, ఏప్రిల్7: రక్తదానం మరొకరి ప్రా ణాన్ని నిలబెడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని అన్నారు. మరో ప్రాణం రక్షించడానికి తమ రక్తాన్ని ఇతరులకు దానం చేయాలని వారు సూచించారు. గురువారం రామాయంపేట పోలీస్ సర్కిల్, రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, సీసీ కెమెరాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాలకన్నా రక్తదానం మహా దానమన్నారు. రక్తదానం చేసేవారు తనంతట తానే ముందు కు రావడం మంచి పరిణామమన్నారు. ముందుగానే రామాయంపేట సర్కిల్లోని సీఐ.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఎస్సైలు రాజేశ్, సుభాశ్‌గౌడ్, ప్రకాశ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి ముందు వరుసలో ఉండి రక్తదానం చేశారు. అనంతరం ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే, ఎస్పీలు అభినందించి, వారికి బిస్కట్లు, కూల్‌డ్రింక్‌లు అందజేశారు.
ఒక్క కెమెరా వందమందితో సమానం
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 105 సీసీ కెమెరాలను అమర్చడం గొప్ప విషయమని ఎమ్మెల్యే, ఎస్పీ అన్నారు. సీసీ కెమెరాలు బిగించిన ఆపరేటర్, హెడ్‌కానిస్టేబుల్ రాజాగౌడ్‌ను వారు అభినందించా రు. అనంతరం వారు మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరస్తులను సునాయసంగా పట్టుకోవచ్చన్నారు. సీసీ కెమెరాలతో మున్సిపల్లో ఎక్కడ ఏమి జరిగినా క్షణా ల్లో తెలుసుకునేలా సీసీలను అమర్చడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, రామాయంపేట సీఐ చంద్ర శేఖర్‌రెడ్డి, ము న్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, నిజాంపేట జడ్పీటీసీ పంజ విజయ్‌కుమార్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, దామోదర్‌రావు, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, సర్పంచ్‌లు శ్యాములు, సుభాశ్, మల్లేశం, స్వామి, నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్‌రెడ్డి, ఐలయ్య, బాలుగౌడ్, సురేశ్‌నాయక్ పాల్గొన్నారు.