పాపన్నపేట, ఏప్రిల్03: ప్రతిఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని, దీంతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని తొగుట పీఠాధిపతి మాధవానందస్వామి వెల్లడించారు. ఆదివారం పాపన్నపేట మండలంలోని నాగ్సాన్పల్లి గ్రామ శివారులో గత కేదారేశ్వర స్వామి ఆలయ 39వ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవానందస్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు 1008 కలశాలతో మహారుద్రాభిషేకం, కుంకుమార్చనలు. అన్నదానంచేశారు. కార్యక్రమంలో నాయకులు గజవాడ రాజేశ్వర్, నర్సింలు గుప్తా, ఇంద్రసేనారెడ్డి, త్యార్ల రమేశ్, సత్యనారాయణ, ప్రధాన పూజారులు చంద్రశేఖర్‌శర్మ, భార్గవ్శర్మ, వంశీశర్మ, సందీప్‌శర్మ, రామ్శర్మ, అర్చకులు రాజశేఖర్‌శర్మ, రామ్శర్మ, శ్యాంసుందర్‌శర్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
జైన మందిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ
కొల్చారం, ఏప్రిల్ 3: మండల కేంద్రంలోని జైన మందిరాన్ని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. జైనుల ఆరాధ్య దైవం 23వ తీర్థంకరుడు పార్శనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి సుమేర్ చంద్ జైన్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. జైన మందిరం చరిత్ర వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించిన ఆవులను సంరక్షిస్తుండడంపై ఎమ్మెల్సీ అభినందించారు. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లని ఆయన తెలిపారు. పూజారి ఎమ్మెల్సీకి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ మనోహర్, మాజీ సర్పంచ్ వెంకట్‌గౌడ్, నాయకులు ప్రభాకర్, కృష్ణ, శేఖర్ పాల్గొన్నారు.