మెదక్ అర్బన్/ శివ్వంపేట/ నర్సాపూర్/ హవేళీఘనపూర్/ చేగుంట/ వెల్దుర్తి, ఏప్రిల్ 3 : కేంద్ర ప్రభుత్వం అవ లంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహ రించుకోవాలని సీపీ ఎం జిల్లా నాయకుడు మల్లేశం డిమాండ్ చేశారు. ఇటీవల పెంచిన పెట్రోలు, గ్యాస్, డీజిల్, మందులు, ఎరువుల ధరలను తగ్గిస్తూ లేబర్ కోడ్లను రద్దు చేయాల న్నారు. ఆదివారం జిల్లా కేంద్రం మెదక్‌లోని రాందాస్ చౌర స్తా వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామంలో నర్సాపూర్ – తూప్రాన్ రోడ్డుపై సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధ్దం చేశారు. కేంద్రం నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నదన్నారు. ధరలను తగ్గించాలని లేకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు శంకర్, యాదగిరి, నరేశ్, కుమార్, దుర్గయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
అచ్చే దిన్ లేదు.. సచ్చే దిన్లా ఉంది…
అచ్చే దిన్ పేరుతో గద్దనెక్కిన బీజేపీ ప్రభుత్వం ధరలను పెంచుతూ ప్రజలకు సచ్చే దిన్ చూపిస్తున్నది సీపీఎం డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు దుయ్యబట్టారు. నర్సాపూర్‌లోని గాంధీ విగ్రహం వద్ద పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరోనా కష్టకాలం నుంచి బయటపడక ముందే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను పెంచడం సరైన విధానం కా దని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు దాసు, బైల్పాటి గణేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్, పెట్రో ధరలకు నిరసనగా ఆందోళన
హవేళీఘనపూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలోఆందోళన నిర్వహింంచారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ దేశ సంపదను అమ్ముతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు వీడకపోతే గుణపాఠం తప్పదని హెచ్చ రించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్, లక్ష్మణ్, మల్లేశం, రాములు, నర్సింహులు పాల్గొన్నారు.
ధరలు పెంచి పేదప్రజల ఊసురు తీస్తున్నది..
కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను పెంచి పేదల ఊసురు తీస్తున్నదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేగుంట మండలంలోని వడియారం గ్రామం లో సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో రాజు, నవీన్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలి..
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. వెల్దుర్తిలో సీపీఎం, సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం పెట్రో ధర లను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రజలపైభారం మోపుతుం దన్నారు. కేంద్రం వెంటనే స్పందించి ప్రజా, ఉద్యోగ, కార్మి క, కర్షక వ్యతిరేక విధానాలను నిలిపి వేయాలన్నారు. ధర్నాలో సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు పోచయ్య, శ్రీను, నర్సిం హులు, మైసయ్య పాల్గొన్నారు.