మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట, ఏప్రిల్ 3 : మెదక్ మం డలంలోని రాజ్‌పల్లి, తిమ్మక్కపల్లి, మంబోజిపల్ల్లి, మాచవరం గ్రామాల్లో ఆదివారం గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం సమర్పించారు. సాయంత్రం అమ్మవార్లకు బోనా లు, ఎండ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో స ర్పంచ్‌లు ప్రేమలత, వైస్‌ఎంపీపీ ఆంజనేయు లు, గంజి ప్రభాకర్, నాయకులు ఎలక్షన్‌రెడ్డి, సాంబశివరావు, తిమ్మకపల్లి వార్డు సభ్యుడు కృష్ణ పాల్గొన్నారు.
రేణుకాఎల్లమ్మ మాతకు ప్రత్యేక పూజలు
మెదక్ మండలంలోని మంబోజిపల్లి శివారులో కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జునస్వామి క్షేత్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజారి మల్లన్న ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌లో దుర్గామాత అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు, ఎడ్లబండ్ల ఊరేగింపున నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.
నేటినుంచి ముత్యాలమ్మ ప్రతిష్ఠాపనోత్సవాలు
కొల్చారం, ఏప్రిల్ 3 : సంగాయిపేటలో సోమవారం నుంచి ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో ఉత్సవాలను బుధవారం వరకు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సర్దన నల్లపోచమ్మ ఆలయంలో ఎంపీపీ పూజలు
హవేళీఘనపూర్, ఏప్రిల్ 3 : మండలంలోని సర్దనలో నల్లపోచమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఎంపీపీ శేరి నారాయణరెడ్డి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, నాయకులు రాజేశ్వర్‌రావు, శివరాములు, సిద్ధ్దిరాములు, పూజారి రాము పాల్గొన్నారు.
సీతారామచంద్ర మందిరానికి భూమిపూజ
నర్సాపూర్, మార్చి 3 : మండల పరిధిలోని నత్నాయపల్లి గ్రామంలో నిర్మిస్తున్న సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకుడు రమేశ్‌నాయక్ భూమిపూజ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ సాయమ్మ, ఎంపీటీసీ గాయత్రి, ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షుడు అశోక్, గ్రామస్తులు ఉదయ్‌కుమార్, ఎల్లం, నాగేశ్, బాలయ్య ఉన్నారు.
కొల్చారంలో గ్రామ దేవతలకు పాచిబండ్ల ఊరేగింపు
కొల్చారం, ఏప్రిల్ 3 : మండలకేంద్రంలో గ్రామ దేవతలకు పాచిబండ్ల ఊరేగింపును సర్పంచ్ ఉమ ప్రారంభించా రు. ప్రతి ఏటా ఉగాది, మరుసటి రోజు జాతర జరుగుతుంది. ఆదివారం పాచిబండ్లను నల్లపోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మమ్మ అమ్మవార్ల్ల ఆలయాల చుట్టూ ఊరేగించారు.