‘పది’లో ఆరు పేపర్లే..
పదో తరగతి పరీక్షలు ఈ యేడు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.
- పరీక్ష సమయం అరగంట పెంపు
- ఈ విద్యా సంవత్సరం మాత్రమే
- 70శాతం సిలబస్‌తోనే పరీక్షలు
- మే 11 నుంచి వార్షిక పరీక్షలు
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 30: పదో తరగతి పరీక్షలు ఈ యేడు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై బోర్డు ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న 11పేపర్లకు బదులుగా ఈసారి ఆరు పరీక్షలే నిర్వహించాలని ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక పరీక్ష మాత్రమే ఉండాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో జిల్లాలోని పాఠశాలల్లో హాజరుశాతం మెరుగుపడింది.
గతేడాది కరోనా నేపథ్యంలో 11పేపర్లకు బదులు ఆరు పేపర్లకు కుదించారు. కానీ కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వాహణ సాధ్యం కాకపోవడంతో పరీక్షలు రాయకుండానే అందరినీ ఉతీర్ణులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం తగ్గడంతో ఈసారి మాత్రం ఆరు పరీక్షలే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 11నుంచి మే 20వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మే 16న జరిగే జనరల్ సైన్స్ పరీక్ష మా త్రం ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ ప్రశ్న పత్రాల ఆన్సర్ షీట్లు వేర్వేరుగా ఇవ్వనున్నారు. 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు.

ఒక్కో పరీక్షకు 3:15గంటల సమయం..
పదో తరగతి పేపర్లు తగ్గించడంతో పరీక్షల సమ యం అరగంట పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒక్కొ పరీక్ష 3గంటల 15నిమిషాల పాటు జరుగనున్నది. సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్ర్తాలకు వేర్వేరు సమాధాన పత్రా ల ఉండనున్నాయి. బోర్డు పరీక్షకు 80మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలకు 20 మార్కులు చొప్పున కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

