-సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
శివ్వంపేట, మార్చి 27 : యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా అన్నారు. ఆదివారం శివ్వంపేట ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధించుకొని కేంద్రం సహకారం లేకున్నా రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలిపారని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి వచ్చేది గడ్డుకాలమేనని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ రైతులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఎంపీడీవో నవీన్ కుమార్, ఎంఈఒ బుచ్యానాయక్, సర్పంచ్‌లు పత్రాల శ్రీనివాస్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, బాబురావు, బాలమణినరేందర్, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీ దశరథ్ పాల్గొన్నారు.
నరేంద్రమోదీ సర్కార్ వడ్లను కొనుగోలు చేయాల్సిందే..
మెదక్‌రూరల్, మార్చి 27 : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని మెదక్ ఎంపీపీ యమునాజయరాంరెడ్డి అన్నారు. మెదక్ మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీపీ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. అనంతరం గ్రామాల్లో రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానం చేసి వాటి ప్రతులను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పంజాబ్, హర్యానా వంటి రాష్ర్టాల్లో పండించిన పంటలను కేంద్రం కొనుగోలు చేస్తున్నది, తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడంలో అంతర్యమేమిటిని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కేంద్రమంత్రి తెలంగాణ ప్రజలను కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం మొండి వైఖరిని వీడి ధాన్యం కొనుగోలు పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆంజనేయులు, ఎంపీటీసీలు ప్రభాకర్, శ్రీహరి, మ్యాకల మానసరాములు, నాయకులు ఉన్నారు.