చేగుంట/ మనోహరాబాద్/ చిన్నశంకరంపేట, మార్చి 20 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, సంకాపూర్ సర్పంచ్ సుజాత పేర్కొన్నారు. నార్సింగి మండలం సంకాపూర్ గ్రామం లో ఆదివారం సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రధానంగా సీసీరోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణాలు చేపట్టడంతో పల్లెలన్నీ పరిశు భ్రంగా మారుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేశ్, నాయకులు చిందం రవీందర్, శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ముమ్మరంగా పల్లె ప్రగతి పనులు
మనోహరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమ పనులను నిరంతరం కొనసాగుతున్నాయి. గౌతోజిగూడెం, కూ చారం, కొండాపూర్ తదితర గ్రామాల్లో స్వచ్ఛత పనులను చేపడుతు న్నారు. గౌతోజిగూడెంలో ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించడంతోపాటు హరితహారం మొక్కలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ రేణుకుమార్, నేచర్ ఐకాన్ కూచారం గ్రామ యువకులు పాల్గొన్నారు.
సీసీరోడ్డు పనులు ప్రారంభం
చిన్నశంకరంపేట మండలంలోని మాందాపూర్(టీ) గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ భిక్షపతిగౌడ్ ప్రారంభించారు.