చిలిపిచెడ్, మార్చి 20 : ప్రభుత్వ బడుల రూపురేఖలు మారి, త్వరలోనే కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో చిలిపిచెడ్ మం డలంలోని మొత్తం 11 పాఠశాలల్లో 8 ప్రాథమిక, 3 ఉన్నత పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ప్రతి పాఠశాల నిర్వాహణ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహించి, ప్రజల భాగస్వామ్యం తో ‘మనఊరు – మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశ గా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మండలంలో 11 ఎంపికైన పాఠశాలలు…
చిలిపిచెడ్, ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి, గౌతాపూర్, చిట్కుల్ తండా, చిట్కుల్, చండూర్ గ్రామాల్లోని ప్రాథమిక పాఠశా లలతోపాటు చిట్కుల్, గౌతాపూర్, ఫైజాబాద్ గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలు ‘మన ఊరు- మనబడి’కి ఎంపికయ్యాయి.
పాఠశాలల్లో చేపట్టనున్న పనులు..
ప్రతి పాఠశాలలో 12 రకాల పనులు చేపట్టనున్నారు. బడికి ప్ర హరీ, కిచెన్ షెడ్లు, ఫర్నిచర్, డిజిటల్ విద్య, గ్రీన్‌చాక్ బోర్డు ఏ ర్పా టు, తరగతి గదుల మరమ్మతులు, శిథిలావస్థ గదుల స్థానంలో కొత్త నిర్మాణాలు, మరుగుదొడ్లలో నీటివసతి, మధ్యాహ్న భోజనానికి డైనింగ్‌హాల్, తాగునీటి వసతి పనులు చేపట్టనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చిలిపిచెడ్ మండలంలో ‘మనఊరు- మనబడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాల ల్లో 12 రకాల పనులు చేపట్టనున్నాం. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటు న్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంలో ‘మనఊరు- మనబడి’ పథక లక్ష్యాలను పూర్తి చేయడానికి కృషి చేస్తాం.
– ఎంఈవో బుచ్చనాయక్, చిలిపిచెడ్ మండలం