శివ్వంపేట, మార్చి 20 : మండలంలోని సికింద్లాపూర్ గ్రామంలో ప్రసిద్ధ్దిగాంచిన లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానపూజారి ధనుంజయశర్మ, ఆలయ ఇన్చార్జి ఈవో శశిధర్గుప్త్తా, పూజారి విద్యాకర్‌చారి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
స్వామి కల్యాణానికి పుస్తెమెట్టెల అందజేత
శివ్వంపేట మండలం అల్లీపూర్లో నిర్వహిస్తున్న మల్లన్నస్వామి కల్యాణమహోత్సవానికి టీఆర్ఎస్ మండల కోశాధికారి బండారి గంగాధర్ పుస్తెమెట్టెలను అందజేశారు. అనంతరం గంగాధర్‌ను యాదవ సంఘం సభ్యులు సన్మానించా రు. పిల్లుట్ల గ్రామానికి చెందిన చింత యశోద, బాలయ్య దం పతుల కూతురు వివాహానికి పుస్తెమెట్టెలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగుణాశ్రీనివాస్, మాజీ సర్పంచ్ డాకూరి కిష్టమ్మ, నాయకులు సాధు రాములు, బండారి నగేశ్, కంజర్ల ఆంజనేయులు, పల్లి మధు పాల్గొన్నారు.
కొండాపూర్‌లో ప్రారంభమైన మల్లన్నజాతర
కొండాపూర్‌లో మల్లన్న జాతర ప్రారంభమైంది. యాదవ కులస్తులు గంపలు తేవడం తోపాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మమతారవి ముదిరాజ్ పాల్గొన్నారు.
గ్రామాల్లో మల్లన్నస్వామి ఉత్సవాలు …
మండలంలోని పలు గ్రామాల్లో మల్లికార్జున స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నా యి. కర్నాల్పల్లిలోని మల్లికార్జునస్వామి, బ్రమరాంభ, గొల్ల కేతమ్మ ఆలయ వార్షికోత్సవాలు నిర్వహించారు. హోమం, గంగకు పోవుట, గంపలు పోవుట, ఒగ్గు కథ చేపట్టారు. సోమవారం మల్లన్నస్వామి కల్యాణం, అన్నదానం, అగ్నిగుండాలు తొక్కుట, గొలుసు తెంపుట, బోనాలు, మంగళవారం రేణుకా ఎల్లమ్మ కల్యాణం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా పూజలు నిర్వహించారు.
ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి పెద్దమ్మ ఆలయ కమిటీ ఆహ్వానం
అనంతసాగర్‌లో ఈ నెల 20 నుంచి 24 వరకు నిర్వహిస్తు న్న పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు రావాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్‌లు ఎం.శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశంగారి సిద్ధ్దిరాములు, బోనగారి నర్సింహులు, భిక్షపతి, ఎర్ర యాదగిరి, అలీ, లక్ష్మణ్ ఉన్నారు.
ఎమ్మెల్యేకు హనుమాన్ ఆలయ కమిటీ ఆహ్వానం…
చిట్టోజిపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే రఘునంధన్రావుకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, పరశురాములు, గుట్ట మల్లయ్య, వెంకటేశ్, నవీన్ ఉన్నారు.
మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
గొల్లపల్లి గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాధామల్లేశ్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు హరిప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.
చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో…
మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో చాముండేశ్వరీ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారికి కుంకుమార్చన, ఒడిబియ్యం సమర్పించారు. ప్రధాన పూజారి ప్రభాకరశర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఆహ్వానం
మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ముదిరాజ్ సంఘం నా యకులు ఆహ్వానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, ముదిరాజ్ సంఘం నా యకులు రవీందర్ ముదిరాజ్, నాగభూషణం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.