రామాయంపేట రూరల్, జూలై 20 : దేశంలోఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతువేదికలు నిర్మించారని వ్యవసాయశాఖ కమిషనరేట్ ఎరువుల విభాగం జేడీ, ఆగ్రోస్ ఎండీ రాములు అన్నారు. అక్కన్నపేట రైతు వేదికలో బు ధవారం ఆయన మాట్లాడారు. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణలో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. రైతులు ఆత్మగౌరవంగా జీవించాలని, లాభదాయక పంటలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రైతు ల కోసం నిర్మించిన కార్యాలయాలే రైతు వేదికలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాస్త్రీయ పద్ధ్దతులు పాటించి, వ్యవసాయాధికారుల సూచనలతో సాంకే తిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పంటల ను సాగు చేయాలని పేర్కొన్నారు. రైతు వేదికలకు ప్రతి క్లస్టర్ పరి ధిలో ఏఈవోను నియమించామని పేర్కొన్నారు.
ఏఈవోలు రైతువేదికలో ఉంటూ రైతులకు సలహాలు, సూ చనలు ఇవ్వడంతోపాటు సందేహాలను నివృత్తి చేయాలన్నా రు. రైతులు కూడా ఉదయం పూట వేదికలో సమావేశమై.. పంటల సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ చర్యలను అధికారులతో మాట్లాడి తెలుసుకోవాల న్నారు. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రియ పద్ధతులు పాటిస్తే పంట దిగుబడి పెరుగుతుందన్నారు. మనం చేసే వ్యవసాయాన్ని చూసి పట్టణాల నుంచి వచ్చేవారికి ఆసక్తి కలిగేలా ఉండాలన్నారు. భవిష్యత్ తరాలకు లాభదాయక వ్యవసాయం అందించాలని సూచించారు. ఎరువులు, విత్తనాలు అందబాటులో ఉండే విధంగా రాక్ పాయింట్ ఏర్పా టు చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో మార్క్ఫెడ్ ఎండీ యాదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్, ఏవో రాజ్నారాయణ, రైతు బంధు మండల అథ్యక్షుడు బానప్పగారి నర్సారెడ్డి, ఏఈవోలు సిద్ధ్దిరాములు, గంగాధర్, కోఆప్షన్ సభ్యులు తాజోద్దీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.