మద్దూరు(ధూళిమిట్ట)/కొమురవెల్లి, జూలై 20: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల కేంద్రంలోని తాజ్గార్డెన్లో మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన 300 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి, కొమురవెల్లిలో పలువురు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరా రు. టీఆర్ఎస్లో చేరినవారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశప్రధాని నరేంద్ర మోదీ 15ఏండ్ల పాటు పాలించిన గుజరాత్లో కూడా ప్రజలు తాగునీటి కోసం ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే మోదీ వాటిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పేదలపై భారం పడే విధంగా కేంద్రం పన్నులు విధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే బండి సంజయ్, రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకురావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు, కొమురవెల్లి మండల కేంద్రాల్లో ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం రూ. 13లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, తలారి కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌కుమార్, మంద యాదగిరి, గీస భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వంగ భాస్కర్‌రెడ్డి, సద్ది కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి, సాయిమల్లు, స్థానిక సర్పంచులు జనార్దన్‌రెడ్డి, సార్ల లత, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.