జూనియర్ సివిల్ జడ్జి అనిత
నర్సాపూర్, మార్చి 9: మహిళలు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో స్ఫూర్తి పొందాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. బుధవారం మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నర్సాపూర్ కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి, జూనియర్ సివిల్ జడ్జి అనిత హాజరయ్యారు. ముందుగా మహిళ కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మహిళా న్యాయవాదులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషులతో సమానంగా మన భారత రాజ్యాంగం ద్వారా హక్కులు సాధించుకున్నామని వెల్లడించారు. మహిళలను చిన్నచూపు చూడరాదని సూచించారు. అదే విధంగా ఎన్జీవో భవనం లో ప్రభు త్వ అధికారులు ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో పీపీ రాఘవేంద్ర, మాజీ మహిళ పీపీ సృజనరెడ్డి, న్యాయవాది సత్యనారాయణ, బార్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్, మహిళ న్యాయవాది స్వరూపరాణి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, టీఎస్జీవో నర్సాపూర్ యూ నిట్ అధ్యక్షుడు శేషాచారి, ఉద్యోగులు పాల్గొన్నారు.