మనోహరాబాద్, జూలై 16 : అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ ఎస్ పార్టీ లక్ష్యమని, ఎంతమంది వచ్చినా గజ్వేల్‌లో ఎవరూ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావని.. కనీసం తమ దరిదా పుల్లోకి రారని పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్‌లు, నాయకులు పేర్కొన్నారు. మనోహరాబాద్‌లో టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, నాయకులు శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల అండదండలు ఉన్నాయని, ఏ ఊరికెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న పనులు, తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో ఒక్కసారి గజ్వేల్ నియోజకవర్గాన్ని చూస్తేనే అర్థమవుతుందన్నారు. తండాలకు సైతం డబుల్‌లైన్ రోడ్లు, సీసీ రోడ్లు, 24 గంటల విద్యుత్ సరఫరాతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేసి ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన ఉందన్నారు. రైతు సంక్షేమాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకున్న పాపానా పోలేదన్నారు. రైతుల కోసం మొదటి సారిగా 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా కాళేశ్వరం జలాలను రప్పించి వ్యవసాయానికి సీఎం కేసీఆర్ జీవం పో శారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో నేడు గోదావరి జలా లు ప్రతి చెరువు, కుంటలకు చేరాయని వివరించారు. రాజకీయంగా అతిబలమైన టీఆర్ఎస్ను తాకేశక్తి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేదని మండిపడ్డారు. ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై విషపూరిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారం చేపట్టి ఏమి చేయలేని బీజేపీ.. తెలంగాణకు ఏమి చేస్తుందని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. అసమర్థ ప్రధానిగా మోదీ చరిత్రకె క్కారన్నారు. గజ్వేల్ గడ్డపై ఎప్పటికైనా ఎగిరేది టీఆర్ఎస్ పార్టీ జెండానేనన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్ ముదిరాజ్, మండలాధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీహరిగౌడ్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.