మెదక్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : మాతా శిశు సంరక్షణ కేంద్రానికి(ఎంసీహెచ్) వచ్చే రోగుల తోపాటు గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాలని డాక్టర్లకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని అన్ని వార్డులను సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి లో వైద్యసేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దవాఖానకు వచ్చే రోగులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? దవాఖానల్లో బాలింతలకు కేసీఆర్ కిట్ ఎలా అందుతున్నాయి? అనే విషయాలను ఆరా తీశారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏ ర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రం నిరుపేదలకు వరమని, ఈ కేంద్రం ద్వారా తల్లీబిడ్డలకు అ ధునిక వైద్యం అందుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ వైస్ చైర్మన్ లా వణ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, వైద్యులు శివదయాల్, షర్మిల, అమర్‌సింగ్, కిరణ్‌కుమార్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, టీఆర్ ఎస్ హవేళీఘనపూర్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు లింగారెడ్డి, బాల్‌రెడ్డి, నవీన్ ఉన్నారు.