మెదక్/ మెదక్ రూరల్, మార్చి 8: మహిళలు వజ్రంలాంటి వారని, కేసీఆర్ సర్కారు హయాంలోనే మహిళలకు పెద్దపీట వేస్తున్నారని టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్స్, టీఎన్జీవో భవన్లో విజన్ సంస్థ, సఖీ కేంద్రం, నాబార్డు సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సర్కారు హయాంలోనే మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిందని, మెదక్‌కు రైలు త్వరలో వస్తుందని, జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్ దవాఖానను మంజూరు చేయగా, పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పుడు జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారని, అందుకుగానూ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే…
ఆశ కార్యకర్తలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావుతో కలిసి స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లను, ఆశ కార్యకర్తలను, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, ఏఎన్ఎంలు, కానిస్టేబుళ్లను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, కౌన్సిలర్లు బట్టి లలిత, మేడి కల్యాణి, కిశోర్, వసంత్‌రాజ్, సమీయొద్దీన్, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, సీడీపీవో భార్గవి, డాక్టర్లు సుమిత్ర, మణికంఠ, పార్టీ పాపన్నపేట మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, బాలాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, మేడి మధుసూదన్‌రావు, ఉమర్, జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సఖి కేంద్రంతో మహిళలకు భరోసా..
టీఎన్జీవో భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలు నిర్భయంగా టోల్ ఫ్రీ నెంబర్ 181కు కాల్ చేయవచ్చని సూచించారు. అంతకుముందు విద్యార్థుల ఉపన్యాసాలు, నృత్య గీతాలు ప్రదర్శించారు. వారికి బహుమతులు, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళలను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు షీల్డ్ అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్, డీడీఎం నాబార్డు సుశీల మోతి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎల్డీఎం లీడ్ బ్యాంక్ వేణుగోపాల్‌రావు, సఖీ కేంద్ర సపోర్ట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కైలాశ్, సఖీ కేంద్ర నిర్వాహకురాలు శాంత, ఏపీఎం ఇందిర, మహిళా శిశుసంక్షేమ శాఖ సీఏ పద్మలత, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లక్ష్మణ్, మెదక్ సీడీపీవో భార్గవి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.