అల్లాదుర్గం, మార్చి5: దళితుల ఆర్థికాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మండలంలోని ముస్లాపూర్ ఫంక్షన్హాల్లో శనివారం దళితబంధు లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని అమలు చేసి ఒక్కో యూనిట్‌కు రూ. 10లక్షల చొప్పున అందిస్తున్నారని తెలిపా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. దళిత కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకోవాలని సూ చించారు. మొదటి విడుతలో భాగంగా అందోల్ నియోజకవర్గానికి 100యూనిట్లు మంజూరు చేసి లబ్ధిదారులను ఎంపి క చేశామని తెలిపారు. లబ్ధిదారులు కోళ్లఫారాలు, కుటీర పరిశ్రమలు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చేందలన్నా రు. లబ్ధిదారులు ఒకే తరహా యూనిట్లను ఎంచుకోవద్దని, దీని వల్ల వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. ముఖ్యంగా ఉత్పత్తి తక్కువగా ఉన్న రంగాన్ని ఎంచుకుంటే లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఇందులో పాడి గేదెల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు.
మనఊరు- మనబడి దేశానికే ఆదర్శం..
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, మనఊరు-మనబడి కార్యక్రమం దేశానికే ఆదర్శమ ని ఎమ్మేల్యే క్రాంతికిరణ్ అన్నారు. పాఠశాల రూపరేఖలు మార్చడంతో పాటు నూతన ఒరవడిని సృష్టించబోతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఇందు లో పూర్వవిద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ బడుల్లో చదువుకొని ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని అందించేలా క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థను బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మాజీ ఎంపీపీ కాశీనాథ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు పాల్గొన్నారు.