పటాన్చెరు, డిసెంబర్ 18: ఆరోగ్యం ఉన్నవారే అధిక సంపన్నులని, యువత ఫిట్‌నెస్‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరులోని మైనార్టీ షాదీఖానాలో నిర్వహించిన ఫిట్టెస్ట్ తెలంగాణ 2022-23 పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. స్నాచ్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. 70 కేజీల లోపు, పైన విభాగాల్లో పుషప్స్, స్కాట్స్, ప్లాంక్ పోటీలు నిర్వహించారు. యువకులు, యువతులకు జరిగిన ఈ పోటీల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీ పడి బలప్రదర్శనలు చేయడం అందరినీ ఆకట్టుకున్నది. పోటీ పడి పుషప్స్ కొట్టడం, స్కాట్స్ చేయడాన్ని ఎమ్మెల్యే పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో క్రీడలకు మహర్దశ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని క్రీడల హబ్‌గా మారుస్తున్నామన్నారు. జిన్నా రం, పటాన్చెరు, పాటి గ్రామాల్లో మినీ స్టేడియాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికే పటాన్చెరులో మైత్రి మైదానం క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. పుషప్స్, స్కాట్స్, ప్లాంక్ పోటీలు దేహదారుఢ్యానికి ప్రతీక అన్నారు. యువత రోజూ వ్యాయమం చేస్తూ ఫిట్‌గా ఉండాలని సూచించారు. ఒకప్పుడు యువతకు వ్యాయామశాలలు అక్కడక్కడ ఉండేవన్నారు. ఇప్పుడు జిమ్‌లు అన్ని చోట్ల ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. కరోనా తరువాత అందరిలో ఆరోగ్యంపై సృహ పెరిగిందన్నారు. ఇప్పుడు అధిక ధనవంతుడు ఆరోగ్యం ఉన్నవాడేనని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్యం పాడైన తరువాత ఎంత మరమ్మతు చేయాలన్నా కాదన్నారు. ప్రజలు గ్రామాలు, పట్టణాల్లో ప్రారంభం అవుతున్న పల్లె ప్రకృతి వనాలు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లను వాడుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పచ్చటి పల్లె ప్రకృతి వనాల్లో నడక కోసం వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసిందన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మూడు విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఆర్సీపురం మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, విజయ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, గుండమల్ల రాజు, షకీల్, సతీశ్‌గౌడ్, మహమూద్, గోపి, రేఖ, జీవన్, మారుతీరావ్, ఇసాక్ పాల్గొన్నారు.