పటాన్చెరు/ పటాన్చెరు టౌన్, డిసెంబర్ 18 : పోచారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు బొడ్డు జగన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో బీఆర్ఎస్లో చేరారు. సర్పంచ్ జగన్‌కు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పటిష్టంగా ఉందన్నారు. సీఎఎం కేసీఆర్ అభివృద్ధే లక్ష్యం గా ముందుకు పోవడం చూసిన సర్పంచ్‌లు, వివిధ పా ర్టీల ముఖ్య నాయకులు బీఆర్ఎస్ చేరుతున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలకు భారీగా నిధు లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. పోచారం గ్రామా న్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సర్పంచ్ జగన్ నిరంతరం గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. సర్పంచ్ జగన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీలకతీతంగా నిధులను ఇచ్చి ప్రొత్సహిస్తుండడంతో తాను బీఆర్ఎస్లోకి వచ్చానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బి.పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, నాయకులు దశరథరెడ్డి, కోడూరి బిక్షపతి, తలారి భిక్షపతి, ఆంజనేయులు, యాద య్య, కృష్ణయ్య, ఉప సర్పంచ్ రాజు పాల్గొన్నారు.