పెద్దశంకరంపేట, డిసెంబర్ 12: పట్టణంలోని మార్కండేయ మందిరంలో అయ్యప్ప మహా పడిపూజను సో మవారం వైభవంగా నిర్వహించారు. రామచంద్రాచారి గురుస్వామి ఆధ్వర్యంలో మహంకాళి రాజేశ్ స్వామి నివాసంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామి 18 మెట్ల పూలమాలలతో అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమారస్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు చేశారు. స్వాములు శరణు ఘోషల మధ్య భజనలు, కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆసూరి మురళీపంతులు, చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, గురుస్వాములు రామన్న, వెంకట్రావ్, రామ్మూర్తి, పరందాం, సురేంద్ర, శ్రీహరి, నరేశ్, సాయిరాం పాల్గొన్నారు.
రామాయంపేటలో..
రామాయంపేట, డిసెంబర్ 12: పట్టణంలో అయ్యప్ప మహాపడిపూజను సోమవారం ఘనంగా నిర్వహించా రు. అయ్యప్ప స్వామి ఆలయంలో పట్టణానికి చెందిన మాలదారులు సామాల రవి, బల్ల యాదగిరి, గురుస్వాములు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, మర్కు నగేశ్ ఆధ్వర్యంలో మహాపడి పూజ చేశారు. స్వామికి మంగళహారతులు, నైవేద్యాలు సమర్పించారు. స్వాములు భజనలు చేస్తు పాటలు పాడారు. స్వామివారి సన్నిధిలో 18 మెట్లకు పూజలు చేశారు. కార్యక్రమంలో దోమకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.