రామాయంపేట, నవంబర్ 21: గ్రామీణ ప్రాంతాల్లో జరి గే ఉపాధి హామీ పనుల్లో నాణ్యాత ఉండాలని లేకుంటే చర్య లు తప్పవని జిల్లా డీఆర్డీఏ పీడీ. శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రజాదర్బార్ నిర్వహించి గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ ఆడిట్ వివరాలను సేకరించారు. ఉపాధి హామీలో పనులు చేసే టీఏలు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఆన్లైన్లో పనులు నమోదు చేయాలన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే దానికి బాధ్యులు అక్కడి కార్యదర్శులు, సిబ్బంది అవుతారన్నారు.
ఇప్పటి వరకు అలాంటివేవి జరుగలేదని ఇక నుంచి ఆన్లైన్ ప్రకారం పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో జాబ్‌కార్డులు ఉన్నవారికే పనులు ఉంటాయని లేనివారికి పనులు ఉండవన్నారు. జాబ్‌కార్డులు లేని వారి పేరిట ఎవరైనా పనులు చేయిస్తే దానికి బాధ్యులు ఫీల్డ్ అసిస్టెంట్లు అవుతారన్నారు. ప్రభుత్వం ఎన్ని రోజులు పను లు కల్పిస్తే ఉపాధి కూలీలకు అన్ని రోజుల పాటు పనులు చేపట్టేలా చూడాలన్నారు. ప్రతి కూలికి కొలతల ప్రకారం డబ్బులను చెల్లించాలన్నారు. ఏ మాత్రం తక్కువ వచ్చినట్లు తెలిస్తే వారిపై చర్యలు ఉంటాయన్నారు.
రామాయంపేట మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఇకపై ఉపాధి సిబ్బంది తమ పద్దతులు మార్చుకోవాలని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు జిల్లా అధికారి శ్రీనివాస్ సూచించారు. కార్యక్రమంలో రామాయంపేట ఎంపీడీవో ఉమాదేవి, మనోహరబాద్ ఎంపీడీవో యాదగిరిరెడ్డి, విజిలెన్సు అధికారి శ్రీహరి, క్వాలిటీ కంట్రోలర్ రమాకాంత్, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఆయా గ్రా మాల కార్యదర్శులు, సర్పంచ్, ఎంపీటీసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు హాజరయ్యారు.