నిజాంపేట/ చిలిపిచెడ్/ రామాయంపేట, నవంబర్ 16 : ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేం దర్‌రెడ్డి పేర్కొన్నారు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన బాస మహేశ్ కుమారుడు రిశ్విత్(3) గుం డెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. రిశ్విత్కు శస్త్రచికిత్స నిమిత్తం రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని బుధవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఎల్వో సీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వెంకట్‌గౌడ్, కొమురయ్య, రైతుబంధు సమితి గ్రామాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, గ్రామస్తులు సుధాకర్‌రెడ్డి, ఎల్లయ్య, నారాయణ తదితరులు ఉన్నారు.
చిలిపిచెడ్ మండలంలోని సోమక్కపేట గ్రామానికి చెందిన శేరిలా పరమేశ్వర్‌కు రూ.60వేలు, శీలంపల్లి గ్రామానికి చెంది న దుర్గారాముకు రూ.26500 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో చిలిపిచెడ్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేదప్రజ లకు వరమన్నారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సర్పంచ్‌లు ఉన్నారు.
పేదలకు సీఎం సహాయనిధి వరయని టీఆర్ఎస్ నాయకుడు అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. రామాయంపేట పట్టణానికి చెందిన గొల్ల స్వామి కుటుంబీకులకు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 50వేల సీఎం సహాయ నిధి చెక్కును టీఆర్ఎస్ నాయకులు ఇంటికి వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి, సురేశ్ నాయక్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.