కొండాపూర్, నవంబర్ 14 : సీఎంఆర్ఎఫ్ పేదలకు అండగా ఉంటుందని హ్యండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మం డలంలోని మల్కాపూర్, సీహెచ్ కోనాపూర్, కొండాపూర్, మల్లేపల్లి, సీతారాంకుంట, సైదాపూర్, సీహెచ్ గోపూలా రం, గుంతపల్లి, గొల్లపల్లి, గారాకూర్తి, తొగర్పల్లి, అనంతసాగర్, మారేపల్లి, కొండాపూర్ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు రూ.10.11 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్రంలోనే సంగారెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ తీసుకువచ్చానన్నారు. ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నా రు.
కొండాపూర్ మండలానికి ఇంత పెద్దఎత్తున నిధులు అందించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, టీఆర్ఎస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, సర్పంచ్‌లు నర్సింహులు, ఫయీం, ప్రకాశం, మాజీ సర్పంచ్‌లు, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు జలీల్, టీఆర్ఎస్ నాయకులు మల్లాగౌడ్, వంశీగౌడ్, అనంత్‌రెడ్డి, జగదీశ్వర్, సత్యనందం, శ్యాం రావు, ఎంపీటీసీ రాందాస్, గోవర్ధన్‌రెడ్డి, రఘనాథ్‌రెడ్డి, ప్రభుదాస్, అంజీరెడ్డి, నాగయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, అనిల్, కుమార్ పాల్గొన్నారు.
సదాశివపేట, నవంబర్ 14: సీఎం రిలీఫ్‌ఫండ్ పేదలకు వరమని హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 26మంది లబ్ధిదారులకు రూ.10లక్షల 75వేల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పెద్దగొల్ల అంజనేయులు, ఆరిఫోద్దీన్, ఎంపీటీసీలు మాధవరెడ్డి, సత్యనారాయణ, సంతోశ్‌గౌడ్, సుధాకర్, సర్పంచ్ యేసయ్య, లక్ష్మారెడ్డి, నరేశ్‌గౌడ్, రాములు, శ్రీనివాస్, శేఖర్, నిజామ్, నాయకులు విఠల్‌రెడ్డి, చోటుమియా, నగేశ్, మధుకర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.