కోహెడ, నవంబర్ 11: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని నూతన గ్రామపంచాయతీ ధర్మసాగర్పల్లికి చెందిన పెండెల హేమలత రాష్ట్ర, జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో రాణిస్తున్నది.రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం పొందుతూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నది. పెండెల హేమలత సైక్లింగ్‌లో చూపిన ప్రతిభను చూసి ప్రోత్సాహంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లక్ష రూపాయలు అందజేశారు.
హేమలత పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే. ఇంటర్ వరకు ధర్మసాగర్పల్లి నుంచి కోహెడకు సైకిల్‌పై వెళ్లి చదివేది. డిగ్రీ కోహెడ నుంచి బస్ ద్వారా కరీంనగర్ వెళ్లి చదువుకు న్నది. ఇంటి నుంచి కోహెడకు సైకిల్‌పై వెళ్లిన అనుభవంతో డిగ్రీలో సైక్లింగ్‌పై అవగాహన పెంచుకుంది. మౌంటైన్ బైక్, రోడ్ రేస్, ట్రాక్స్ ఈవెంట్లో పుణ్యం సాధించింది. మొదటి సారిగా మెదక్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం సంపాదించింది. మెదక్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది.
తదుపరి కరీంన గర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మౌంటైన్ బైక్‌లో ప్రథమ స్థానం సంపాదించింది. అనంతరం కీసర గుట్టలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం, ఘట్కేసర్లో జరిగిన పోటీ ల్లో ద్వితీయ స్థానం సంపాదించింది. రాష్ట్రస్థాయిలో చూపిన ప్రతిభ ఆధారంగా పూణె, ముంబాయిలలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన పోటీల్లో ఎమ్టీబీలో ద్వితీయ స్థానం పొందింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి మోటర్‌బైక్, రోడ్ రేస్ రెండింటిలోప్రథమ స్థానం సంపాదించింది.
రంగనాయక సాగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సంపాదించిన పెండెల హేమలతకు ప్రోత్సాహకంగా లక్ష రూపాయలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఎంపీపీ కీర్తి శాలువా కప్పి సన్మానించారు.
లక్ష రూపాయలు అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు, అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి