జిన్నారం, నవంబర్ 11: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆ కోవలోనే మత్స్యకారులకు ఉచితంగా చేపల పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. శుక్రవారం మండల కేంద్రం జిన్నారంలోని రాయుని చెరువులో 3.5 లక్షల చేప పిల్లలను స్థానిక నాయకులు, మత్స్యకారులతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మత్స్యకారుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారన్నారు.
నాలుగైదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని చెరువు, కుంటల్లో చేపలను పెంచి, వాటితో వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవడంతో చెరువు, కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలతో పాటు చేపలు పట్టడంలో వృత్తి నైపుణ్య శిక్షణ కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. చేపలు అమ్ముకోడానికి మార్కెటింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యేను స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, సర్పంచ్‌లు లావణ్యశ్రీనివాస్‌రెడ్డి, జంగంపేట సర్పంచ్ వెంకటయ్య, కొడకంచి సర్పంచ్ శివరాజ్, నల్తూర్ సర్పంచ్ జనార్దన్, ఉపసర్పంచ్ సంజీవ, మాజీ సర్పంచ్ జనార్దన్‌గౌడ్, జంగంపేట ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నీలం సత్యనారాయణ, శ్రీధర్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బీమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.