మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 11: ప్రతి విద్యార్థి అబుల్ కలాం ఆజాద్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సురేఖ ఆధ్వర్యం లో జయంతి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీతో పాటు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గొప్ప విద్యావేత్త, దేశ తొలి విద్యాశాఖ మంత్రి ఆజాద్ చేసిన సేవల కు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని జాతీ య విద్య, మైనార్టీ సంక్షేమ దినంగా ప్రకటించిందన్నారు. పే ద కుటుంబం నుంచి వచ్చిన ఆజాద్‌ను విద్యార్థులు ఆదర్శం గా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడువాలన్నారు. మా రుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మహిళ లు ఆపద సమయంలో ఆధైర్యపడకుండా వెం టనే డయల్ 100కు లేదా షీటీమ్ వా ట్సాప్ 6303923823 సమాచారం అం దించాలని సూచించారు. జిల్లా యంత్రాం గం మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు.
మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నా రు. విద్య లేక మైనార్టీల వెనుకబాటు తనాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి కల్పించి వారి సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. విద్యార్థిని ప్రదర్శించిన సాంస్కృతిక ప్ర దర్శనలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి జెమ్లా, మున్సిపల్ కౌన్సిలర్లు, షీటీమ్ సభ్యులు ఏఎస్ఐ రుక్సానా, కానిస్టేబుళ్లు విజయ్, గంగమణి, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
– మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్