రామాయంపేట, నవంబర్ 11: రాష్ట్రంలో ఆడబిడ్డల పెం డ్లి కోసం సీఎం కేసీఆర్ కల్యాలక్ష్మి చెక్కులను కానుకగా ఇస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యే వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులను పరిశీలించి కాంట్రాక్టర్ గజవాడ నాగరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. కల్యాణలక్ష్మి ద్వారా సీఎం కేసీఆర్ సార్ ప్రజలకు, ఆడబిడ్డలకు మరింత దగ్గరయ్యారన్నారు. మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రంగాల్లో అర్హులైనా వారు 51వేల మందికి కేసీఆర్ సర్కార్ పింఛన్లను ఇస్తుందన్నారు. రైతుల పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందన్నారు.
రామాయంపేటలో 300డబుల్ బెడ్రూంలు సిద్ధంగా ఉన్నాయని కొంతమంది వ్యక్తులు డబుల్బెడ్రూంలలోని విద్యుత్‌కు సంబంధించిన సామగ్రిని ఎత్తుకెళ్లారని అందుకోసం వాటి పంపిణీని ఆపడం జరిగిందన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూంలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, ఎంపీడీవో ఉమాదేవి, డిప్యూటీ తాసీల్దార్ స్వప్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మహేందర్‌రెడ్డి, మైలారం శ్యాములు, నర్సాగౌడ్, సుభాశ్, స్వా మి, మల్లేశం, ఎంపీటీసీ మల్లన్నగారి నాగులు, మున్సిపల్ కౌన్సిలర్లు దేమె యాదగిరి, శారదరాజు, సుందర్‌సింగ్, నాయకులు చంద్రపు కొండల్‌రెడ్డి ఉన్నారు.
పాపన్నపేట, నవంబర్ 11: కల్యాణలక్ష్మి పథకం పేదల పాలిట వరం అని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గతంలో బీద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఆడపిల్లల పెండ్లిళ్లు చేయాలంటే పడరాని పాట్లు పడేవారని, సీఎం కేసీఆర్ వీటిని దృష్టిలో పెట్టుకొని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాట్లు సరిగ్గా చేయక పోవడంతో పాపన్నపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్పై ఎమ్మెల్యే ఆగ్రహాం వ్యక్తం చేశారు. వందమంది లబ్ధిదారులకు సుమా రు కోటి రూపాయలు పంపిణీ చేసే కార్యక్రమానికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. వందమంది లబ్ధిదారులు వివిధ గ్రామాల ప్రజలు, అధికారులు, పాత్రికేయులు హాజరైనప్పటికీ ఏ మాత్రం సరిపోని గదిలో సమావేశం ఏర్పాటు చేస్తారా అంటూ ఆర్ఐని నిలదీశారు.
సమావేశం గురించి ముందుగా సమాచారం ఉన్నప్పటికీ పాపన్నపేట తహసీల్దార్ గైర్హాజరు కావడం ఏంటి అంటూ మండిపడ్డారు. ఇక ముందు ఇలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లఫోరం మండల అధ్యక్షుడు కుబేరుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, పాపన్నపేట స ర్పంచ్ గురుమూర్తి గౌడ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.