వెల్దుర్తి, నవంబర్ 10 : కరెంట్ తీగలతో ప్రమాదం పొంచి ఉండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మండ లంలోని శంశిరెడ్డిపల్లితండా పంచాయతీ బండమీదిపల్లి గ్రా మంలో ఏండ్ల క్రితం వేసిన విద్యుత్ స్తంభం రోడ్డు నిర్మాణం తో మధ్యలోకి రాగా, విద్యుత్ తీగలు ఇండ్లకు అనుకొని పోవ డంతో ఇండ్లపై ప్రమాదకరంగా తీగలు వేలాడుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి ముందే విద్యుత్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలిగించక పోవ డంతో ఈ సమస్య వచ్చిందటున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ శాంతి విద్యుత్ స్తంభం తొలిగించడంతో పాటు ఇం డ్లపై నుంచి ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలిగించాలని మండల సర్వసభ్య దృష్టికి తీసుకెళ్లారు.
సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ, జడ్పీటీసీ, విద్యుత్‌శాఖ ఏఈని ప్రమాదంగా ఉన్న వాటిని సరిచేయాలని ఆదేశించారు. స్పందించిన ఏఈ రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాన్ని తొలిగించి రోడ్డు వెంబడి వేసి, ప్రమాదకర విద్యుత్ తీగలను తొలిగించాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. గ్రామానికి వెళ్లిన కాంట్రాక్టర్ రోడ్డు వెంబడి నూతన స్తంభాలను ఏర్పాటు చేసి, విద్యుత్ తీగలు సరి చేయాలంటే తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకర విద్యుత్ తీగలను తొలిగింపచేయాలని గ్రామస్తులు కోరారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు వాపోయారు.
పని వదిలేసిన విషయం మా దృష్టికి రాలేదు
– వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఏఈ
శంశిరెడ్డిపల్లితండా పంచాయతీ బండమీదిపల్లి గ్రామంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ సభ దృష్టికి తీసుకు వచ్చాడు. ఎంపీపీ, జడ్పీటీసీలు విద్యుత్ స్తంభా లు వేసి, ప్రమాదకర తీగలను తొలిగించాలని సూ చించారు. వారి ఆదేశాల మేరకు సంబంధిత కాంట్రాక్టర్‌కు పనులు చేయాలని ఆదేశించాము. కానీ డబ్బులు అడిగి మధ్యలో పనులు నిలిపివేసినట్లు ఎవరూ మా దృష్టికి తీసుకురాలేదన్నారు. ప్రమాదకర తీగలను తొలిగించి పనులను పూర్తి చేయిస్తాం.